ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి
Published Sun, Nov 27 2016 10:51 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
భూపాలపల్లి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్ ముందు లారీ బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న కొత్తూరి మొగిలి అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement