సర్పాల నేస్తం
పాములంటే ఎవరికైనా భయమే..అయితే పత్తికొండకు చెందిన మోహన్‌రాజు వాటికి నేస్తంగా మారాడు. పట్టణంలో ఎవరి ఇళ్లలోకైనా పాములు వచ్చాయంటే చాలు వెంటనే అక్కడి వాలిపోతాడు. అందరూ చూస్తుండగానే సునాయసంగా విషసర్పాన్ని చేత పట్టుకొని కోరలు తీసేస్తాడు. ఆ తరువాత ఊరు బయట వదిలేస్తాడు. పట్టణంలో 11 ఏళ్లగా దాదాపు 70 పాములకు పైగా కోరలు తీసేసి ఊరు బయట వదిలేశాడు. పాములను చంపకూడదని.. మానవాళికి, పర్యావరణానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ఇతను చెబుతాడు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాడు.
- పత్తికొండ