ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాం | Solve Teachers Problems | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాం

Published Sun, Nov 13 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాం

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాం

కడప స్పోర్ట్స్‌: వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అన్నారు. ఆదివారం నగరంలోని డీసీఈబీ సమావేశ మందిరంలో ఏపీ పీఈటీ, ఎస్‌ఏ (పీఈ) అసోసియేషన్‌ వైఎస్‌ఆర్‌ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు ఒక్క విజిల్‌తో పాఠశాలను క్రమశిక్షణలో ఉంచగలిగే సమర్థులన్నారు. అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ త్వరలో పూర్తికానుందని, దీనికి సంబంధించి అమలు ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంఘాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. నవ్యాంధ్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ సమస్యల పోరాటంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ షామీర్‌బాషా, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ఎలియాస్‌రెడ్డి, నాయకులు శివశంకర్‌రాజు, కాంతారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
ఏపీ పీఈటీ, ఎస్‌ఏ (పీఈ) అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా శివశంకర్‌రాజు, అధ్యక్షుడిగా బి. నిత్యప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా కె. రమేష్‌యాదవ్, కోశాధికారిగా ప్రతాప్‌రెడ్డి, సహ అధ్యక్షుడుగా రామచంద్రయ్య, ఉపాధ్యక్షులుగా రెడ్డ య్య, ఇజ్రాయిల్, వెంకటసుబ్బయ్య, విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా సుబ్రమణ్యం, సాగర్, రామ్మూర్తి, స్టేట్‌ కౌన్సిలర్‌లుగా ఎస్‌.సాజిద్, నగేష్‌లను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement