‘సాక్షి’ చిత్తూరు, అనంతపురం జిల్లా ఎడిషన్లలో ప్రచురితమైన కథనం చూసి స్థానికంగా ఉన్న తన స్నేహితులు, మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన అర్షద్ హజరత్, మరో యువకుడు మహబూబ్ ఖాన్ తన వద్దకు వచ్చి విషయం చెప్పారన్నారు. వెంటనే స్నేహితుడిని వెంటపెట్టుకుని ఇక్కడికి వచ్చేశానన్నారు. తమది అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం గాంధీనగరని తెలిపిన ఆయన రోడ్డు పక్కన పడి ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు నిలబెట్టిన దయార్ధ్ర హృదయులకు కృతజ్ఞతలు తెలిపారు.
నాన్న కోసం వచ్చిన పుత్రుడు
Published Tue, Jan 24 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
మదనపల్లె క్రైం : ‘నాన్నను వదిలేశారు’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన స్వర్ణకారుడు ఉత్తరాది రంగాచారి కథనం కన్నబిడ్డ హృదయాన్ని కదిలించింది. సోమవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగాచారిని వెతుక్కుంటూ వచ్చిన కుమారుడు నాగరాజు ఆయనను అక్కున చేర్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నాలుగు నెలల క్రితం అంగడికని చెప్పి ఇంట్లోనుంచి వచ్చిన తన తండ్రి దారి తప్పిపోవడం వల్లే ఇలాంటి కష్టాలు వచ్చాయన్నారు.

Advertisement