సంఘర్షణలతో... సమున్నతానికి... | sp autobiography | Sakshi
Sakshi News home page

సంఘర్షణలతో... సమున్నతానికి...

Published Tue, Aug 9 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఎస్పీ ఎల్‌కేవీ రంగారావు

ఎస్పీ ఎల్‌కేవీ రంగారావు

ఆర్మీలో చేరాలనుకున్నా... పోలీసు అధికారినయ్యా
డాక్టర్‌ అవ్వాలన్న తల్లి కోరిక నెరవేర్చలేకపోయా
విధి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా
సవాళ్లను సానుకూలంగా మలచుకుంటా
ఇప్పటికి 22 బదిలీలు
అయినా తరగని ఆత్మవిశ్వాసం
సాక్షితో ఎస్పీ ఎల్‌.కె.వి.రంగారావు
 
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆయనకు బదిలీలు కొత్తకాదు. సవాళ్లెదురైతే సానుకూలంగా మలచుకోగలరు. అనుకున్నది సాధించేవరకూ అలుపెరుగని పోరాటం చేస్తారు. ఎక్కడికెళ్లినా పాలనలో తనదైన ముద్రపడాలని ఆకాంక్షిస్తారు. ఆయనే విజయనగరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎల్‌.కె.వి.రంగారావు. మనలో ఎన్నో ఆకాంక్షలుంటాయి. వాటికి పరిస్థితులు అనుకూలించకపోతే... కొత్తవాటిని పొంది సంతప్తి చెందాలి. తల్లి ప్రోత్సాహంతో ఉన్నత విద్యనభ్యసించి సైనికుడిగా దేశానికి సేవ చేయాలనే సత్సంకల్పంతో ముందుకు సాగి.. పరిస్థితుల ప్రభావంతో పోలీసు అధికారిగా మారారు రంగారావు. తల్లిదండ్రులకు ఆసరాగా ఎవరూ లేకపోవడంతో సివిల్‌ సర్వీసెస్‌ను లక్ష్యంగా ఎంచుకుని పోలీస్‌ శాఖలో చేరారు. ఎక్కువసార్లు బదిలీలు, పోలీసు ఉద్యోగంలోకి ఎందుకొచ్చానన్న అసహనం ఆయనకూ ఎదురైంది. కానీ పోలీసు విధి ఉద్యోగం కాదు... మిషన్‌లాంటిదని, సవాళ్లతో కూడిన బాధ్యతని నమ్మారు. అందులోనే విజయాలు సాధిస్తున్నారు. సాక్షితో ఆయన పంచుకున్న మరిన్ని విషయాలు మీ కోసం...
 
 
డోకిపర్రు మాస్టారి కొడుకుగా...
మాది కష్ణాజిల్లా డోకిపర్రు. మాది మధ్యతరగతి కుటుంబమే. అమ్మ అనసూయమ్మ, నాన్న శీరాబంది రాజు. నాన్నగారు ఉపాధ్యాయునిగా పనిచేశారు. అమ్మేమో గహిణి. విద్యాభ్యాసమంతా ఊళ్లోనే జరిగింది. నేను ఒక్కడ్నే కుమారుడ్ని, ఇద్దరు అక్కచెల్లెళ్లు. ఆరో తరగతిలో చేరే లోపే అమ్మ నాకు భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను నేర్పించింది. అందులో నీతిని వివరించేది. అవే నేటికీ నాకు మార్గదర్శకాలయ్యాయి.
 
 
పాపం డాక్టర్‌ కావాలన్న అమ్మ కోరిక తీరనేలేదు. 
డాక్టర్‌ అవ్వాలని మా అమ్మ కోరిక. దానికోసం ప్రయత్నం చేశాను. మెడిసిన్‌కి అప్లై చేసిన దగ్గర నుంచి ఏదో రకమైన ఇబ్బందులే ఎదురయ్యాయి. వ్యయప్రయాసలు పడి పరీక్షలకు సిద్ధమయ్యాను. కానీ, హాల్‌ టిక్కెట్‌ ఆలస్యంగా రావడం, నిర్దేశిత సమయానికి గుంటూరు మెడికల్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరలేకపోవడంతో పరీక్ష రాయలేకపోయాను. అమ్మకోరిక తీర్చలేకపోయానే... అని ఆరోజు బాధపడ్డాను.
 
 
ఆర్మీలో చేరాలనుకుని అనుకోకుండా ఐపీఎస్‌
యాక్ట్యువల్‌ గా నేను ఆర్మీలో చేరాలనుకున్నాను. కానీ ఒక్కడ్నే కొడుకుని కావడం వల్ల మా అమ్మ, నాన్నలను అంటిపెట్టుకుని ఉండాల్సి వచ్చింది. అందుకే అది కాస్తా విరమించుకున్నాను. ఇంటర్‌లో చేరిన తర్వాత వయసు ప్రభావం వల్ల సమాజంలో మార్పు తీసుకురావాలంటే నక్సలిజమే కరెక్ట్‌ అనుకున్నా. సొసైటీని మార్చే అవకాశం దానికే ఉందనుకున్నాను. మానసిక సంఘర్షణకు లోనైన ఆ సమయంలో మాకు బాగా ఆత్మీయులైన వైద్యులు రాజారావు(ఇల్లందు)తో చర్చించాను. తప్పటడుగని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. Ðð ంటనే దాన్ని విరమించుకున్నాను. సమాజసేవ కోసం సివిల్‌ సర్వీసెస్‌ కరెక్ట్‌ అనుకుని అందుకోసం కష్టపడి చదివాను. 
 
 
ఎక్కడా ఎక్కువ కాలం చేసింది లేదు
ఐపీఎస్‌కు ఎంపికయ్యాక తీవ్ర వాద నిరోధక విభాగంలో 14ఏళ్లు పనిచేశాను. అందులో పనిచేసే వారికున్న ఇబ్బందులు తెలియనివి కావు. నాన్నను కూడా సరిగా చూడలేక పోయాను. సాధారణంగా విధుల్లో ఎటువంటి వారికైనా ఒత్తిళ్లు తప్పవు.   సమాజాన్ని మార్చాలనే తపన నన్ను ఎక్కడా ఉండనివ్వలేదు. రాజకీయ కారణాలు వల్ల ఇప్పటికే 22 బదిలీలు చవిచూశాను. తొలి పోస్టింగ్‌ పెద్దాపురం ఎస్‌డీపీఓగా బాధ్యతలు స్వీకరించి కేవలం 11 రోజులే పనిచేశా. రెండోపోస్టింగ్‌  రాజమండ్రిలో  పదినెలలు చేశాను. మూడోపోస్టింగ్‌ వరంగల్‌లో... అక్కడి నుంచి పలు చోట్ల పనిచేశాను. అన్నిచోట్లా... ఒత్తిళ్లు, సవాళ్లు ఎదుర్కొన్నాను.
 
 
కొంతలో... కొంత సామాజిక సేవ
పోలీసు శాఖలో వచ్చిన రివార్డు రూ. 15లక్షలను పుట్టిన ఊళ్లోని ఇంటికి దగ్గర్లో బాబా సాహెబ్‌ సమసమాజ సంస్కతి సదన్‌ పేరుతో కమ్యూనిటీ భవనం నిర్మించాను. అందులో పెద్ద లైబ్రరీ కూడా పెట్టించాను. బాల్యంలో గ్రంథాలయం ద్వారా ఎంతో లబ్ధిపొందాను. ఎన్నో పుస్తకాలను నా తండ్రి తీసుకువచ్చి అందించేవారు. అదే స్పూర్తితో లైబ్రరీ ఏర్పాటు చేశాను.
 
 
ప్రజా సమస్యల పరిష్కారమే... ధ్యేయం
ద్వేషం, అత్యాశ పెరిగిపోవడంవల్లే నేరాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పాటి విషయాలకే చంపుకునే వరకు వెళ్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరిగితేనే ఇవి తగ్గుతాయి. మీడియా, ప్రజా సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి, అటువంటి నేరాలు తగ్గించాలన్న ఆలోచనతో వెళ్తున్నాను. పోలీసుల కోసం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. పనిచేసే వారికి గుర్తింపు ఇస్తాను. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాను. ఎన్నో బాధలు కలిగితే తప్ప పోలీసుల వద్దకు ప్రజలు రారు. అలా వచ్చినోళ్లందరికీ సాంత్వన చేకూర్చడమే కాకుండా న్యాయం జరిగేలా చూడటమే లక్ష్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement