చల్లనితల్లికి బూరెలతో నివేదన
విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి ఆలయ అధికారులు మంగళవారం బూరెలతో నివేదన చేశారు. మంగళవారం వేకువ జామునుంచి అమ్మవారికి పంచామతాలతో అభిషేకాలు, అనంతరం సహస్ర కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు తాళ్లపూడి భాస్కరరావు, దూసి కష్ణమూర్తి, రమణ, రవిప్రసాద్, ధనుంజయ్‌లు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మూడులాంతర్లువద్ద ఉన్న చదురుగుడిలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి పసుపు,కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి వద్ద ఉన్న అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. కార్యక్రమాలను ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సూపర్‌వైజర్‌లు రామారావు, ఎం.అప్పలనాయుడులు పర్యవేక్షించారు.
23విజెడ్‌జి 174 : బూరెలతో అమ్మవారికి నివేదన