వేడుకగా లక్ష్మీకుబేర వ్రతం | Special prayers at Mahalakshmi temple | Sakshi
Sakshi News home page

వేడుకగా లక్ష్మీకుబేర వ్రతం

Published Thu, Aug 11 2016 12:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

వేడుకగా లక్ష్మీకుబేర వ్రతం - Sakshi

వేడుకగా లక్ష్మీకుబేర వ్రతం

 
నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్‌ కోదండరామపురంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం లక్ష్మీకుబేరస్వామి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి చైర్మన్‌ పత్తి నరసింహం మాట్లాడారు. దేవస్థాన 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులుగా అమ్మవారికి విశేషపూజలు, అభిషేకాలను నిర్వహించామని చెప్పారు. ఆలయ ప్రధానార్చకుడు నాగరాజుశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఉభయకర్తలుగా కాటేపల్లి వెంకటరమణయ్య, సరిత దంపతులు వ్యవహరించారు. దేవస్థాన పాలకమండలి సభ్యులు వాసిపల్లి నారాయణరెడ్డి, దామెర చంద్రమౌళి, నూకతోటి వెంకటేశ్వర్లు, గోవిందరాజు, పత్తి శ్రీనివాసులు, ఎర్ర వెంకటసుబ్బానాయుడు, తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement