క్రీడలకు ప్రాధాన్యం
-
టౌన్‌హాల్ కమిటీ అధ్యక్షుడు యార్లగడ్డ వీర్రాజు
బోట్‌క్లబ్ (కాకినాడ) :
సేవా కార్యక్రమాలతో పాటు క్రీడల నిర్వహణకు టౌన్‌హాల్ ప్రాధాన్యమిస్తుందని టౌన్‌హాల్ కమిటీ అధ్యక్షుడు యార్లగడ్డ వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక మెయిన్‌రోడ్డులో ఉన్న టౌన్‌హాల్‌లో శుక్రవారం రాష్ట్రస్థాయి సీనియర్, జూనియర్స్ బిలియర్డ్స్, స్నూకర్స్ ర్యాంకింగ్ చాంపియన్ 2016 పోటీలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ క్రీడలకు టౌన్‌హాల్ ఆతిథ్యం ఇవ్వడం దశాబ్దాల పాటు సంప్రదాయంగా వస్తోందన్నారు. జూనియన్ విభాగ పోటీలను ప్రారంభించిన టౌన్‌హాల్ కమిటీ కార్యదర్శి జ్యోతుల రాము మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు వసతి సదుపాయాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ టోర్నమెంట్ టౌన్‌హాల్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. సభ్యులకు సేవా కార్యక్రమాలుతో పాటు క్రీడా పోటీలను కూడా పలుమార్లు నిర్వహిస్తూ వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. టోర్నమెంట్ కమిటీ ప్రతినిధి ఐవీ రాజీవ్ మాట్లాడుతూ స్నూకర్స్, బిలియర్డ్స్ పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో టౌన్‌హాల్ కమిటీ శ్రద్ధ తీసుకోవడం అభినందనీమయన్నారు. ఈ పోటీలకు 13 జిల్లాలు నుంచి సుమారు వంద మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి వెత్సా ఆనంద్, టోర్నమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు డీవీఎన్‌రాజు, కార్యదర్శి వి.తరుణ్‌కుమార్, జె.శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.