- పురుషుల విభాగం చాంపియన్‌గా ఆదిత్య
- మహిళల ఓవరాల్ చాంప్‌గా విజయనగరం
- ముగిసిన అథ్లెటిక్ పోటీలు
సత్తా చాటిన విద్యార్థులు
Published Sun, Dec 11 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
భానుగుడి (కాకినాడ) :
జేఎన్‌టీయూకేలో రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర కళాశాల అథ్లెటిక్ పోటీలు ముగిశాయి. క్రీడాకారులకు ఆదివారం లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, రన్నింగ్, డిస్క్‌త్రో, రన్నింగ్ లకు సంబంధించి ఫైనల్ పోటీలు నిర్వహించారు. వ్యక్తిగత విభాగాలతో పాటు, ఓవరాల్ చాంపియ¯ŒS షిప్‌లలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జేఎ¯ŒSటీయూకే కళాశాల ప్రిన్సిపాల్ జీవీఆర్ ప్రసాదరాజు, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి జి.శ్యామ్‌కుమార్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో జేఎ¯ŒSటీయూకే పరిధిలోని 230కు పైగా ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలల్లోని 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
మహిళల విభాగం : మహిళల 1500 మీటర్ల పరుగులో ఎం.సాయిచందన(జీఈసీ గుడ్ల వల్లేరు), 100 మీటర్ల పరుగులో కె.కీర్తి (కాకినాడ), డిస్క్‌త్రోలో కె.వసుధారెడ్డి (ఆదిత్య, సూరంపాలెం), 4+400 మీటర్ల పరుగులో ఎం.తులసి, ఎస్.నవ్యశ్రీ, ఎమ్.బాజీ, టి.రితిక (కైట్), లాంగ్ జంప్‌లో బి.భవానీయాదవ్ (ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ), జావెలి¯ŒS త్రోలో కె.వసుధారెడ్డి (ఆదిత్య, సూరంపాలెం), 400 మీటర్ల రన్నింగ్‌లో ఎస్‌కే.సబీనా, 800 మీటర్ల పరుగులో ఎల్.భార్గవి (కాకినాడ), ట్రిపుల్ జంప్‌లో బి.భవాని యాదవ్ (ఆంధ్ర లయో లా), 200 మీటర్లలో బి.భవాని యాదవ్, షాట్‌ఫుట్‌లో ఎం.ప్రతిభా నిఖిత(కాకినాడ), 100 మీటర్ల పరుగులో ఎల్.భార్గవి, ప్రవల్లిక, ఎస్.తనూష, జి.హారిక లక్ష్మి (కాకినాడ), ఓవరాల్ చాంపియ¯ŒSగా జేఎ¯ŒSటీయూకే విజయనగరం ఇంజనీరింగ్ కళాశాల, రెండోస్థానంలో ఆంధ్ర లయోలా కాలేజీ విజయవాడ, బెస్ట్ అథ్లెట్‌గా బి.భవాని యాదవ్ నిలిచారు.
పురుషుల విభాగం : 1500 మీటర్ల పరుగులో కె.శివ (కైట్), 100 మీటర్లలో వి.తిరుమలరావు (ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పరిటాల), ట్రిపుల్ జంప్‌లో బి.వినోద్‌కుమార్(స్వర్ణాంధ్ర), షాట్‌పుట్‌లో ఎం.పునీత్‌కుమార్ (ఆదిత్య, సూరంపాలెం), హైజంప్‌లో డి.వెంకటేశ్వరరావు (ఎంవీజీఆర్, విజయనగరం), 4+400 మీటర్ల పురుషుల విభాగం పరుగులో పి.కృష్ణచైతన్య, బి.రామకృష్ణ, ఏవీడీ మోహ¯ŒSయాదవ్, ఏడీ ఉదయచౌదరి (ఆదిత్య, సూరంపాలెం) విజేతలుగా నిలిచారు. 5000 మీటర్లలో కె.శివ (కైట్), 200 మీటర్ల పరుగులో ఎ.సత్యగణేష్ (విజ్ఞా¯ŒS, దువ్వాడ), జావ్‌లి¯ŒSత్రోలో ఎ¯ŒS.నవీ¯ŒSరాజ్, లాంగ్ జంప్‌లో డి.వెంకటేశ్వరరావు (ఎంవీజీఆర్), 100 మీటర్ల పరుగులో జి.స్వామి, ఎస్.కళ్యాణ్‌కుమార్, జి.సాయి కుమార్, ఆర్.శేషులు విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగం చాంపియ¯ŒSగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల తొలి రెండు స్థానాలను గెలుచుకుంది. బెస్ట్ అథ్లెట్‌గా డి.వెంకటేశ్వరరావు (ఎంవీజీఆర్, విజయనగరం) నిలిచారు.
Advertisement
Advertisement