శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు | Sreevari, Bramhothsavam, TTD | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు

Published Tue, Aug 30 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

ఆలయం వద్ద ఏర్పాటైన బారికేడ్లు

ఆలయం వద్ద ఏర్పాటైన బారికేడ్లు

– సిద్దమైన శ్రీవారి పుష్కరిణి 
– గదులు, ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్‌ రద్దు 
– సెప్టెంబరు 27న కోయిల్‌  ఆళ్వార్‌ తిరుమంజనం
 
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి  బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3వ తేది నుండి 11వ తేది  వరకు  నిర్వహించనున్నారు. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు పూర్తి చేసి పైపులతో కొత్త నీటిని నింపే చర్యలు మంగళవారం ప్రారంభించారు. 
 
బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఇవి..
–  శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు వేచిఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం ప్రారంభించారు. గరుడ సేవలో లక్షలాది మంది భక్తులు వాహన సేవను దర్శించేలా అదనపు ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ వీధుల్లో రంగుల రంగువళ్లులు అలంకరించారు. 
 
– బ్రహ్మోత్సవాల్లో గదులు, శ్రీవారి ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్‌ రద్దు చేశారు.  
–  ఉత్సవాల్లో అదనంగా సీసీ కెమెరాలు, నిఘా భద్రతా విభాగాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు
– రోజూ 3 వేల నుండి 3500 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యి మందిని రప్పించనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి మరో 50 మంది సిబ్బంది రానున్నారు. ఉత్సవాల్లో టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆక్టోపస్, వంటి ఇతర నిఘా సంస్థలు అనుక్షణం అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేశారు.
 
– కాటేజీలు, అతిథిగృహాలను ముందస్తుగానే మాస్‌క్లీనింగ్‌ నిర్వహించారు. 
–  ఆలయానికి సరికొత్త శోభతో కాంతులీనే విధంగా విద్యుత్‌ అలంకరణ ప్రారంభించారు. 
– అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో సౌకర్యాలు పెంచనున్నారు.
– కల్యాణవేదికలో ఫొటో ఎగ్జిబిషన్, ఫల, పుష్పప్రదర్శన ఏర్పాటుకోసం ప్రణాళికలు సిద్దం చే శారు.
– వేలాదిగా తరలివచ్చే వాహనాల కోసం అదనపు పార్కింగ్‌ కేంద్రాలు, రింగ్‌రోడ్డు సదుపాయం కల్పించనున్నారు.
– హిందూ ధర్మప్రచారం, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. 
– సెప్టెంబరు 16న పున్నమి గరుడ సేవను బ్రహ్మోత్సవం తరహాలో నిర్వహించి లోపాలు గుర్తించనున్నారు. 
– సెప్టెంబరు 27న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.
 
అంగరంగవైభవంగా ఉత్సవాలు: టీటీడీ ఈవో
శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు మంగళవారం విలేకరులకు వెళ్లడించారు. 
భక్తులకు రోజుకు ఏడు లక్షలు  అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేశామన్నారు.పారిశుద్ధ్యం మరింత మెరుగుపరుస్తామన్నారు.  ఉత్సవాల్లో పచ్చదనం, పుష్పాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
 
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
–––––––––––––––––––––––––––––––––––
తేది                   ఉదయం              రాత్రి 
––––––––––––––––––––––––––––––––––
03–10–2016 –ధ్వజారోహణం( సా:6గం)  – పెద్ద శేషవాహనం
04–10–2016 – చిన్నశేషవాహనం   – హంసవాహనం
05–10–2016 – సింహవాహనం    – ముత్యపుపందిరి వాహనం
06–10–2016 – కల్పవృక్షవాహనం –  సర్వభూపాల వాహనం
07–10–2016 – మోహినీ అవతారం–  గరుడ వాహనం
08–10–2016 – హనుమంతæవాహనం,
సాయంత్రం  స్వర్ణ రథోత్సవం     –      గజవాహనం
09–10–2016 – సూర్యప్రభ వాహనం–  చంద్రప్రభ వాహనం
10–10–2016 – రథోత్సవం  – అశ్వ వాహనం
11–10–2016 – చక్రస్నానం  –  ధ్వజ అవరోహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement