మైత్రిపాల సిరిసేన
చిత్తూరు (కలెక్టరేట్):
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబసభ్యులతో కలిసి శనివారం తిరుమలకు విచ్చేయనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం బెంగళూరులో బయలుదేరి రోడ్డుమార్గాన రాత్రి 8.30 గంటలకు తిరుమల చేరుకుంటారు. 08.45 గంటలకు అక్కడి శ్రీకృష్ణ వసతి గృహానికి చేరుకుని రాత్రికి బసచేస్తారు. 21వ తేదీ ఉదయం 2.15 గంటలకు వసతి గృహం నుంచి బయలుదేరి 3 నుంచి 4 గంటల వరకు స్వామివారిని సుప్రభాత సేవలో పాల్గొంటారు. అక్కడి నుంచి వసతి గృహానికి చేరుకుని 9 గంటలకు రోడ్డు మార్గాన బెంగళూరు వెళతారని ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు.
కాన్వాయ్ ట్రై ల్
జిల్లాకు శనివారం శ్రీలంక అధ్యక్షుడు విచ్చేస్తున్నందున పోలీసులు శుక్రవారం కాన్వాయ్ ట్రై ల్ నిర్వహించారు. కర్ణాటక సరిహద్దు నుంచి నేండ్రగుంట వరకు చిత్తూరు పోలీసులు 22 వాహనాలతో కాన్వాయ్ ట్రై ల్ నిర్వహించారు.