భద్రాచలం: భద్రాద్రిలోని మిథిలా మండపంలో శనివారం శ్రీరామ మహాపట్టాభిషేకం వైభవంగా జరుగుతోంది. శ్రీరామ పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్ నరసింహన్ దంపతులు పట్టాభిరాముడికి పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాద్రిలో కన్నుపండువగా జరుపుకుంటున్న ఈ పట్టాభిషేక మహోత్సవ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
భక్తుల జై రామ నినాదాలతో మిథిలా మండపం మార్మోగుతోంది. శ్రీరాముడికి తప్ప మరెవ్వరికీ జరగని రీతిలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ నరసింహన్‌తో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు.
వైభవంగా శ్రీరామ మహా పట్టాభిషేకం
Published Sat, Apr 16 2016 10:34 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement
Advertisement