క్యూలో తొక్కిసలాట
-- గూడూరు ఎస్‌బీఐ వద్ద ఘటన
- పలువురికి గాయాలు
గూడూరు: గూడూరు ఎస్‌బీఐ దగ్గర నగదు కోసం నిలబడిన ఖాతాదారుల క్యూలో తొక్కిసలాట చోటు చేసుకుంది. బ్యాంక్ సిబ్బంది నిర్వాకంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వారం రోజుల నుంచి ఎస్‌బీఐలో నగదు చెల్లింపులు నిలిచిపోవడం, మంగళవారం చెల్లింపులు నిర్వహిస్తామని బ్యాంక్ మేనేజర్ ప్రకటించడంతో ఖాతాదారులు పెద్ద ఎత్తున బ్యాంక్ దగ్గరికి తరలివచ్చారు. ఉదయం 7 గంటలకే చేరుకున్నారు. ఈ రోజు మనిషికి రూ. 8 వేలు చొప్పున చెల్లిస్తామని మేనేజర్ ప్రదీప్‌కుమార్ మైక్‌లో అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. ఈ రోజు నగదు తీసుకోకపోతే వారం రోజుల వరకు నగదు దొరకదనే భయాందోళన కు గురైన ఖాతాదారులు లోపలికి వెళ్లేందకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. మహిళలు, వృద్ధులు కింద పడి గాయాలకు గురయ్యారు. పోలీసులు లాఠీలకు పని చెప్పి నిలవరించాల్సి వచ్చింది. కింద పడిన మహిళలను తొటి మహిళలు బయటకు తీసుకవచ్చి సపర్యలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంక్ సిబ్బంది నిర్వాకంపై ఖాతాదారులు మండిపడ్డారు.