ఎలుక కోసం వచ్చింది.. ఇరుక్కుపోయింది..!
వైవీయూ : కడప నగర పరిధిలోని కొప్పర్తి వద్ద గల శివాజీనగర్ (రేడియో స్టేషన్)లోని రైతు వై. సుధాకర్‌రెడ్డి, సుబ్బలక్ష్మి దంపతుల ఇంటి చుట్టూ చెట్లు, పొదలు కాస్త ఎక్కువే. వీటితో పాటు ఇంట్లో ఎలుకల బెడద తీవ్రంగా ఉండేది. దీంతో ఆయన ఎలుకలను పట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తూనే వచ్చారు. అయితే ఎలుకల బెడదను తట్టుకునేందుకు ర్యాట్ గమ్ ప్యాడ్ (గల్ఫ్ గమ్ స్టిక్కర్)ను ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారి చూస్తే పెద్ద కట్ల పాము ఆ ర్యాట్‌గమ్ ప్యాడ్‌కు చిక్కుకుని ఉండటంతో వారంతా షాక్‌కు గురయ్యారు. రాత్రివేళ ఎలుకల కోసం వచ్చిన పాము ఈ ర్యాట్‌గమ్‌ప్యాడ్‌పై చిక్కుకుపోవడంతో కదలలేక అలాగే ఉండిపోయి నీరసించింది. దీంతో సుధాకర్‌రెడ్డి కట్టె సాయంతో పామును గమ్ స్టిక్ నుంచి తొలగించి చెట్లపొదల్లోకి వదిలివేశారు. చుట్టుపక్కలవారు వామ్మో.. ఎంత పెద్ద పాము అంటూ ఆశ్చర్యంగా చూశారు.