Shivajinagar
-
సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి
శివాజీనగర: పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర్ సొంత ప్రభుత్వం మీదనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది శుద్ధమైన బీజేపీ ప్రభుత్వంగా లేదు, మూడు గ్రూపుల సర్కారు మాదిరి ఉంది. మా ప్రభుత్వం కాంగ్రెస్, జేడీఎస్‌లతో కుమ్మక్కయ్యింది అని విమర్శించారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీకి వెళుతుంటా, వస్తుంటా, అవన్నీ మీడియా ముందు చెప్పలేను. నా ఢిల్లీ పర్యటనపై ఈ ప్రచారం ఎందుకు జరిగిందనేది అర్థం కావటం లేదన్నారు. ముఖ్యమంత్రి మార్పు తన ఉద్దేశం కాదు, సొంత పనిమీదే వెళ్లాను అన్నారు. చదవండి: సీఎం మార్పు కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన చదవండి: చూ మంతర్‌కాళి.. కరోనా పో: బీజేపీ ఎమ్మెల్యే పూజలు -
కరోనా: కోలుకున్నా ఇళ్లకు వెళ్లని రోగులు.. సీఎం ఆగ్రహం
శివాజీనగర: కరోనా నుంచి కోలుకున్నా ఇళ్లకు వెళ్లకుండా కరోనా బాధితులు ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రోగుల తీరుపై సీఎం యడియూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నాటకలోని శివాజీనగరలో మంగళవారం కోవిడ్ వార్ రూమ్‌లను సీఎం తనిఖీ చేశారు. సుమారు 503 మంది 20 రోజులు ఆస్పత్రుల్లో ఉండి కోలుకున్నారు. అయితే వారంతా డిశ్చార్జ్ అయ్యే ఆలోచనలో లేనట్లు తెలుస్తోందన్నారు. బెడ్ల కొరత ఉండడంతో కోలుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని ఈ సంద్భంగా ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. టీకాలు వచ్చిన తక్షణమే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు. వార్ రూంల సిబ్బంది సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి -
ఎలుక కోసం వచ్చింది.. ఇరుక్కుపోయింది..!
వైవీయూ : కడప నగర పరిధిలోని కొప్పర్తి వద్ద గల శివాజీనగర్ (రేడియో స్టేషన్)లోని రైతు వై. సుధాకర్‌రెడ్డి, సుబ్బలక్ష్మి దంపతుల ఇంటి చుట్టూ చెట్లు, పొదలు కాస్త ఎక్కువే. వీటితో పాటు ఇంట్లో ఎలుకల బెడద తీవ్రంగా ఉండేది. దీంతో ఆయన ఎలుకలను పట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తూనే వచ్చారు. అయితే ఎలుకల బెడదను తట్టుకునేందుకు ర్యాట్ గమ్ ప్యాడ్ (గల్ఫ్ గమ్ స్టిక్కర్)ను ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారి చూస్తే పెద్ద కట్ల పాము ఆ ర్యాట్గమ్ ప్యాడ్‌కు చిక్కుకుని ఉండటంతో వారంతా షాక్‌కు గురయ్యారు. రాత్రివేళ ఎలుకల కోసం వచ్చిన పాము ఈ ర్యాట్గమ్ప్యాడ్పై చిక్కుకుపోవడంతో కదలలేక అలాగే ఉండిపోయి నీరసించింది. దీంతో సుధాకర్‌రెడ్డి కట్టె సాయంతో పామును గమ్ స్టిక్ నుంచి తొలగించి చెట్లపొదల్లోకి వదిలివేశారు. చుట్టుపక్కలవారు వామ్మో.. ఎంత పెద్ద పాము అంటూ ఆశ్చర్యంగా చూశారు. -
బెంగళూరులో పట్టపగలే దారుణం!
-
పదేళ్ల తర్వాత తెరుచుకున్న బడి
శివాజీనగర్(దుగ్గొండి) : దేవాలయాల్లాంటి ప్రభుత్వ బడిని కాపాడుకోవడానికి ఊరి ప్రజలంతా ఒక్కటయ్యారు. దశాబ్దం క్రితం మూతపడిన పాఠశాల దుమ్ముదులిపి ఈ నెల 13న తెరిపించారు. శుక్రవారం మంచిరోజు కావడంతో గ్రామంలో ప్రతి విద్యార్థిని మండల అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఊరిబడిలో చేర్పించారు. మొదటి తరగతి గదిని తహసీల్దార్ రమాదేవి ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు అధికారులు పలకలు, పుస్తకాలతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ కుక్కముడి సుశీల, జెడ్పీటీసీ సభ్యురాలు సుకినె రజిత, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, ఎంఈఓ ప్రశాంత్, ఈఓపీఆర్డీ ఖాజామైనొద్దిన్, సర్పంచ్ మంద లక్ష్మి, సుకినె రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఊరి బడి దేవాలయం : ఏజేసీ తిరుపతిరావు ఊరి బడి గ్రామస్తులందరికి అక్షర దేవాలయమని ఏజేసీ తిరుపతిరావు అన్నారు. దానిని పవిత్రంగా భావించి విద్యార్థులందరిని ఊరిబడికే పంపాలన్నారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. చిన్నారులందరితో స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. తమ పిల్లలను ఊరిబడికి పంపిస్తున్న తల్లిదండ్రులను శాలువాలు, పూలమాలలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంఓ మనోజ్‌కుమార్, హెచ్ఎం గట్టు జీవన్‌కుమార్, సర్పంచ్ బొమ్మెన లక్ష్మీశోభన్, సీఆర్పీ రమేష్‌బాబు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరికలు
శివాజీనగర్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ సీపీని గెలిపిస్తాయని పార్టీ అర్బన్ అభ్యర్థి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వెయ్యి మంది మహిళలు, యువకులు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీధర్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు చేయని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకుసాగారని అన్నారు. ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. వైఎస్సార్ చేపట్టిన పథకాలను చూసి, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ అమలుచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో శాశ్వతమైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతులకు అండగా నిలిచారన్నారు. ఆరోగ్యశ్రీతో అందరికి ప్రాణదాత అయ్యారని అన్నారు. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు బుధవారం దశమి కావడంతో నామినేషన్ దాఖలు చేసినట్లు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఉదయం ఒక సెట్‌ను, మధ్యాహ్నం మరో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీధర్, వాసురెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారు శివనంద్, నరేష్‌గౌడ్, సుభాష్, సాయిలు, వంశీ, మహిళలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు ఉన్నారు.