విషజ్వరంతో విద్యార్థిని మృతి
Published Wed, Aug 3 2016 10:53 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
చొప్పదండి: మండలంలోని కాట్నపల్లికి చెందిన సిరిపురం సంధ్య (12) అనే విద్యార్థిని విషజ్వరంతో బుధవారం మృతి చెందింది. రుక్మాపూర్‌లోని ఆదర్శ పాఠశాలలో సంధ్య తొమ్మిదవ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం జ్వరానికి గురి కాగా కుటుంబసభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంధ్య మృతి చెందింది. విద్యార్థిని కుటుంబాన్ని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ వరప్రసాదాచారి పరామర్శించారు.
Advertisement
Advertisement