అనంతలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం | student suicide attempt in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published Sat, Aug 20 2016 12:38 PM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM

student suicide attempt in anantapur

అనంతపురం: కాలేజీకి ఆలస్యంగా వచ్చినందుకు ఉపాధ్యాయులు విధించిన దండనతో ఓ విద్యార్థి మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన అనంతపురం చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. కళాశాలలో చదువుకునే అఫ్రోజ్ ఈ రోజు ఉదయం కళాశాలకు ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయులు అతడిని కళాశాల బయట నించో బెట్టారు.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అఫ్రోజ్ నిద్రమాత్రలు మింగాడు. ఆ విషయాన్ని గమనించిన  కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుడు అఫ్రోజ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ... ఏఐఎస్ఎఫ్ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement