నంద్యాల ఆర్‌డీఓ, సీఐల కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి
Published Thu, Jul 28 2016 12:35 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
కలెక్టర్, ఎస్పీకి కోర్టు ఆదేశం
కర్నూలు(లీగల్): న్యాయవాది పాములేటి కాళ్లకు సంకెళ్లు వేసిన ఘటన కేసులో నంద్యాల ఆర్‌డీఓ, అప్పటి త్రీటౌన్ సీఐ, ఆర్‌డీఓ కార్యాలయ పరిపాలనాధికారి, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల కులధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ కోర్టు బుధవారం జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 10వ తేదీన నంద్యాల న్యాయవాది పాములేటి మరో ఇద్దరిపై నంద్యాల త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా అక్కడ కాళ్లకు బేడీలు వేయడంతో పాములేటి కర్నూలులో ప్రై వేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో ఫిర్యాది, సాక్షుల వాంగ్మూలలను నమోదు చేసిన న్యాయమూర్తి వీవీ శేషుబాబు బుధవారం నంద్యాల ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి, ఏఓ మధుసూదన్, సీనియర్ సహాయకులు సుధాకర్‌రావు, సీఐ వెంకటరమణ, కానిస్టేబుళ్లు శోభన్‌బాబు, లక్ష్మణ్‌రావుల కులధ్రువీకరణ పత్రాలను అందించాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Advertisement