యువతి ఆత్మహత్యాయత్నం
యువతి ఆత్మహత్యాయత్నం
Published Mon, Aug 22 2016 11:25 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
కాట్రేనికోన :
పదో తరగతి సర్టిఫికెట్లు పోయాయన్న మనస్తాపంతో కాట్రేనికోన వంతెనపై నుంచి ఓల్డ్ అయినాపురం డ్రెయి¯Œæలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువతిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఎస్సై షేక్ జానీ బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాట్రేనికోన సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన గుత్తుల వీరవెంకట సత్యనాగేశ్వరరావు కుమార్తె భవాని పదో తరగతి సర్టిఫికెట్లు పోగొట్టుకుంది. దీంతో మనస్తాపం చెంది సోమవారం ఓల్డ్ అయినాపురం డ్రెయి¯Œæలోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అదే సమయంలో బలుసుతిప్పకు చెందిన ఓలేటి నమశ్శివాయ (శివ) తన భార్య లక్ష్మితో కలసి ఆటోలో అమలాపురం వెళుతున్నాడు. కాట్రేనికోన వంతెనపై నుంచి దూకిన భవానిని గమనించిన అతడు మరో ఆలోచన లేకుండా కాలువలోకి దూకాడు. నీట మునుగుతున్న భవానిని వెతికి పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. భవాని ప్రాణాన్ని కాపాడిన శివను స్థానికులు అభినందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement