హౌరా - ఎర్నాకులం సువిధ వీక్లీ రైలు | suvidha express for howrah - ernakulam | Sakshi
Sakshi News home page

హౌరా - ఎర్నాకులం సువిధ వీక్లీ రైలు

Published Wed, Apr 6 2016 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

suvidha express for howrah - ernakulam

తాటిచెట్లపాలెం : వేసవి రద్దీ దృష్ట్యా హౌరా-ఎర్నాకులం-హౌరా స్టేషన్ల మధ్య వీక్లీ సువిధ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 9 నుంచి జూన్ 28వ తేదీల మధ్య 12 ట్రిప్పులు నడపనున్నట్టు ఈకో రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎల్వేందర్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.
 
హౌరా నుంచి ఎర్నాకులం వెళ్లే సువిధ రైలు(02853) ఈ నెల 9 నుంచి జూన్ 25 తేదీల్లో(శనివారాల్లో) సాయంత్రం 5 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 6.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఆపై మర్నాడు ఉదయం 6 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది.
 
తిరుగు ప్రయాణంలో 02854 నంబరుతో ఎర్నాకులం నుంచి ఈ నెల 12 నుంచి జూన్ 28 తేదీల్లో(మంగళవారాల్లో) ఉదయం 8.50 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 8.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 11 గంటలకు హౌరా చేరుకుంటుంది.    
 
ఓ సెకండ్ ఏసీ, నాలుగు థర్డ్ ఏసీ, 12 స్లీపర్ కోచ్‌లు, మరో రెండు సెకండ్ సిట్టింగ్ కమ్ లగేజ్ కోచ్‌లున్న ఈ రైలు భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement