పులివెందుల రూరల్ : బస్సుల్లో నగదు రహిత చెల్లింపులు చేసుకొనేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చెంగల్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జిల్లాకు కొత్త బస్సులు రానున్నాయని తెలిపారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్నారు. పెద్ద నోట్లరద్దు కారణంగా ఆర్టీసీకి మరింత నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం అజ్మతుల్లా, ట్రాఫిక్ సూపరింటెండెంట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.