రైతులంతా ఆనందంగా ఉన్నారా?
సీఎం తీరును తప్పుబట్టిన తమ్మినేని
ఝరాసంగం/న్యాల్‌కల్: ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, చెరువులన్నీ నిండడంతో పంటలు పుష్కలంగా పండి రైతులంతా ఆనందంగా ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించుకోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్, ఎల్గోరుు, న్యాల్‌కల్ మండలం మొల్కన్ పాడ్, హద్నూర్, ముంగి, మిర్జాపూర్(ఎన్)ల్లో శనివారం మహాజన పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోని కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వ్యవసాయ రం గాన్ని అభివృద్ధి పర్చేందుకు అవసరం ఉన్నచోట సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. స్థానిక సంస్థలకు అధిక శాతం నిధులు కేటారుుంచి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులు విద్య, ఆరోగ్య రంగాలను వ్యాపారమయం చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిమ్జ్‌లో భూములు కోల్పోరుున బాధితులకు ఎకరానికి రూ.24 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు