
కౌతాళం చేరిన టీబీ డ్యాం నీరు
కౌతాళం: ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన 1.5టీఎంసీల నీరు శనివారం మండలంలోని ఎల్‌ఎల్‌సీకి చేరింది. ఇటీవల మండల రైతులు తమ పంటల పరిస్థితిని ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోపోవడంతో వారు స్పందించి ఈ నీటిని విడుదల చేయించారు. ఈ నీరు శనివారం మండల సరిహద్దులోకి చేరింది.