చిట్యాల : రాజకీయ కుట్రతోనే స్పీకర్ మధుసూదనాచారి గిద్దెముత్తారం గ్రామానికి తీరని అన్యాయం చేసారని టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులి తిరుపతిరెడ్డి, దొడ్డి కిష్టయ్య, మాజీ జెడ్పీటీసీ ఓరం సమ్మయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి తోట గట్టయ్య అన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ టేకుమట్లకు 11 కి.మీల దూరంలో ఉన్న గిద్దెముత్తారం గ్రామాన్ని 24కి.మీల దూరంలో ఉన్న చిట్యాల మండలానికి పరిమితం చేయడంలో శాస్త్రీయత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇప్పటికైనా గిద్దెముత్తారం గ్రామాన్ని టేకుమట్లలో కలపాలని లేకపోతే నిరసనకార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట యూత్ మండల అధ్యక్షులు గుర్రపు తిరుపతిగౌడ్, ఎంపీటీసీలు పప్పుల శంకర్, గుర్రపు సునీత, నాయకులు సమ్మయ్య, సంతోష్, వెంకట్‌నాయక్, అశోక్, చేరాలు ఉన్నారు.
స్పీకర్ సారూ..ఊళ్లో ఉండలేం ..!
గిద్దెముత్తారం గ్రామాన్ని టేకుమట్ల మండలంలో కలుపలేదని గ్రామ ప్రజలు తమను నిలదీస్తున్నారని స్పీకర్ గారు..స్పందించి న్యాయం చేయాలని ,లేకుంటే గ్రామంలో ఉండే పరిస్థితి లేదని సర్పంచ్ సాంబయ్య, నాయకులు బుర్ర రవిందర్, సంపత్ రావు, తిరుపతి, లింగారావు, వెంకట్‌నాయక్, అంకుషావలీ, గొర్రె చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేసారు. గురువారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేకుంటే తమ పదవులకు రాజీనామా చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.వారి వెంట నాయకులు పొలవేన కుమార్, పోతుగంటి సమ్మయ్య, రాపర్తి మల్లేశం, పంచిక శంకర్, పల్లె సారయ్య, ఓదెలు, భాస్కర్ తదితరులు ఉన్నారు.
రాజకీయ కుట్రతోనే గిద్దెముత్తారానికి అన్యాయం
Published Sat, Oct 15 2016 9:18 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM
Advertisement