టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి
వరంగల్ : టీడీపీ ఎమ్మెల్యేలను టీఆ ర్‌ఎస్‌లో విలీనంచేస్తూ స్పీకర్ మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయంతో రాజ్యాగానికి మచ్చఅని ఆ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నా రు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకర్‌గా జిలా ్లకు చెందిన మధుసూదనాచారికి అవకాశం రావ డం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశామన్నా రు. అరుుతే ఆయన టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలం గా రాజ్యాంగానికి విరుద్ధంగా టీడీపీని విలీ నం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జిల్లాకు అపకీర్తి తెచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆ ర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు రంగుల సినిమా చూ స్తూ మోసం చేస్తోందన్నారు. ప్రతి ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు చేస్తూ టీఆర్‌ఎస్ ప్ర భుత్వం పబ్బం గడుపుతోందన్నారు. మహా ఒ ప్పందం మన రాష్ట్రానికి కాకుండా మహారాష్ట్రకే మేలు జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో గడీల రాజ్యాంగం...
రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కా కుండా కేసీఆర్ గడీల రాజ్యాంగం అమలవుతోం దని మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గ్రే టర్ ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేయడంతోనే టీ ఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందన్నారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం, జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, పుల్లూరు అశోక్‌కుమార్, బొట్ల శ్రీనివా స్,దొనికెల మల్లయ్య,టి.జయపాల్, శ్రీరాముల సురేష్, జాటోత్ సంతోషనాయక్ ఉన్నారు.
స్పీకర్ నిర్ణయంతో రాజ్యాంగానికి మచ్చ
Published Sat, Mar 12 2016 1:42 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM
Advertisement