టీడీపీనేత దారుణ హత్య | tdp leadar mardar | Sakshi
Sakshi News home page

టీడీపీనేత దారుణ హత్య

Published Mon, Jul 25 2016 6:39 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

సాంబశివ(ఫైల్‌) - Sakshi

సాంబశివ(ఫైల్‌)

ఇన్నోవాతో ఢీకొని, వేటకొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు
గుర్రంకొండ: వుండలంలోని నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెకు చెందిన టీడీపీ నేత, వూజీ సైనికోద్యోగి పురం సాంబశివ(37)ను ఆదివారం రాత్రి ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. దాడిలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ప్యారంపల్లెకు చెందిన పురం సాంబశివ గతంలో మదనపల్లె నివాసం ఉన్నాడు. మూడేళ్ల క్రితం సొంత ఊరికి మకాం మార్చాడు. టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నాడు. ఇతను హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఇతనిపై మదనపల్లెలో కేసులు నమోదయ్యాయి. ఈయన కొంతకాలంగా వుండల కేంద్రమైన గుర్రంకొండలో భార్య, కువూర్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఆదివారం రాత్రి నడిమికండ్రిగ పంచాయతీ గెరికుంటపల్లెకు చెందిన వై.ఆనంద్‌(45)తో కలిసి సొంత గ్రావూనికి బయలుదేరాడు. వూర్గవుధ్యంలో చెర్లోపల్లె పంచాయతీ పాలకుంటపల్లెకు చెందిన పసల రమేష్‌(42) వీరి ద్విచక్ర వాహనంలో ఎక్కాడు. కాపుకాచిన ప్రత్యర్థులు గుర్రంకొండకు సమీపంలోని రాచయ్య మామిడి తోట వద్ద వెనుకవైపు నుంచి ఇన్నోవో వాహనంతో ఢీకొన్నారు. వుుగ్గురు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే వాహనం నుంచి దిగిన దుండగులు వేటకొడవళ్లతో సాంబశివను వెంటాడి నరికి హత్య చేశారు. రమేష్‌పై కూడా కొందరు దాడి చేశారు. వాహనం కడప వైపు వెళ్లినట్లు గ్రావుస్తులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రావుకృష్ణ తవు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108లో వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement