Sambasiva
-
తల్లి మందలించిందని...
మల్కాజిగిరి: తల్లి మందలించడంతో మనస్తాపానికిలోనైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సంజీవరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విష్ణుపురి ఎక్స్‌టెన్సన్ కాలనీకి చెదిన భరత్‌రాజ్ ఉమాదేవి దంపతులకు కుమార్తె లాహిరి, కుమారుడు సాంబశివ(16)సంతానం. సాంబశివ స్ధానిక ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు. ఈ నెల 3న చివరి పరీక్ష రాయాల్సి ఉంది. అయితే సోమవారం రాత్రి సెల్ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతుండగా తల్లి మందలించింది. దీంతో గదిలోకి వెళ్లిన సాంబశివ తలుపులు వేసుకుని గడియపెట్టుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత తల్లి తలుపు తట్టినా తెరవకపోవడంతో కిటికీ లోనుంచి చూడగా కిందపడి ఉన్న అతడిని గుర్తించింది. స్ధానికుల సహాయంతో గది తలుపులు తెరిచి చూడగా సాండశివ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. అతడిని స్ధానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొలంలోనే ఆగిన రైతు గుండె
బుక్కపట్నం: పొలంలోకి వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కొత్తచెరువు మండలం కేశాపురం రైతు సాంబశివ (63) కోపగానిపల్లి వద్ద గల పొలంలో పంట సాగు చేశాడు. శనివారం ఈ - క్రాప్ బుకింగ్ చేసుకునేందుకు పొలానికి వెళ్లి ఒక్కసారిగా గుండెపోటు రావటంతో కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వసంతకుమార్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం కోసం కృషి చేస్తామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం బుక్కపట్నంలో నివాసముంటున్నారు. -
టీడీపీనేత దారుణ హత్య
►ఇన్నోవాతో ఢీకొని, వేటకొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు గుర్రంకొండ: వుండలంలోని నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెకు చెందిన టీడీపీ నేత, వూజీ సైనికోద్యోగి పురం సాంబశివ(37)ను ఆదివారం రాత్రి ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. దాడిలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ప్యారంపల్లెకు చెందిన పురం సాంబశివ గతంలో మదనపల్లె నివాసం ఉన్నాడు. మూడేళ్ల క్రితం సొంత ఊరికి మకాం మార్చాడు. టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నాడు. ఇతను హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఇతనిపై మదనపల్లెలో కేసులు నమోదయ్యాయి. ఈయన కొంతకాలంగా వుండల కేంద్రమైన గుర్రంకొండలో భార్య, కువూర్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి నడిమికండ్రిగ పంచాయతీ గెరికుంటపల్లెకు చెందిన వై.ఆనంద్(45)తో కలిసి సొంత గ్రావూనికి బయలుదేరాడు. వూర్గవుధ్యంలో చెర్లోపల్లె పంచాయతీ పాలకుంటపల్లెకు చెందిన పసల రమేష్(42) వీరి ద్విచక్ర వాహనంలో ఎక్కాడు. కాపుకాచిన ప్రత్యర్థులు గుర్రంకొండకు సమీపంలోని రాచయ్య మామిడి తోట వద్ద వెనుకవైపు నుంచి ఇన్నోవో వాహనంతో ఢీకొన్నారు. వుుగ్గురు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే వాహనం నుంచి దిగిన దుండగులు వేటకొడవళ్లతో సాంబశివను వెంటాడి నరికి హత్య చేశారు. రమేష్‌పై కూడా కొందరు దాడి చేశారు. వాహనం కడప వైపు వెళ్లినట్లు గ్రావుస్తులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రావుకృష్ణ తవు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108లో వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
తుడాకు కేంద్రం ఊతం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పరిధిలోని ప్రజల రవాణా కష్టాలు కడతేరనున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం(జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్) పథకం కింద 120 బస్సుల కొనుగోలుకు రూ.27.38 కోట్లను కేంద్రం విడుదల చేసింది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించేందుకు 30 బస్సుల కొనుగోలుకు రూ.9.15 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డీ.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుడా పరిధిలోని తిరుపతి నగరం, శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల్లో జనాభా పెరుగుతూ వస్తోంది. పట్టణీకరణ అధికమవుతున్న మేరకు రవాణా సదుపాయాలు మెరుగుపడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుడా పరిధిలో అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో అధికశాతం మంది ప్రజలు ఎక్కడికైనా వెళ్లడానికి ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై ఆధారపడుతున్నారు. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు అప్పలాయగుంటకు భక్తుల తాకిడి అధికమవుతుండడం.. స్థానిక జనాభా పెరిగిపోతుండడం.. రవాణా సదుపాయాలు మెరుగుపడకపోవడంతో తుడా పరిధిలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. తుడా పరిధిలో రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి 2011-12లో రూ.225 కోట్లతో తుడా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కనీసం లక్ష జనాభాకు 50 బస్సులు అందుబాటులో ఉంచగలిగితే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని తుడా అధికారులు రూపొందించిన ప్రణాళికపై కేంద్రం ఆమోదముద్ర వేసింది. తుడా పరిధిలో 450 బస్సుల కొనుగోలుకు రూ.225 కోట్లను విడుదల చేస్తామని అప్పట్లో కేంద్రం అంగీకరించింది. 2012-16 మధ్య కాలంలో 225 బస్సుల కొనుగోలుకు రూ.112.50 కోట్లు, 2017-2021 మధ్య కాలంలో 113 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు, 2022-31 మధ్య కాలంలో 112 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు విడుదల చేస్తామని అప్పట్లోనే కేంద్రం స్పష్టీకరించింది. ఆ మేరకు 2012-13లో 15 బస్సుల కొనుగోలుకు రూ.7.50 కోట్లను మంజూరు చేసింది. 2013-14లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లను 4 నెలల క్రితం విడుదల చేసింది. 2014-15 బడ్జెట్లో 120 బస్సుల కొనుగోలుకు రూ.27.38 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. 2015-16 బడ్జెట్లో 65 బస్సుల కొనుగోలుకు నిధులను విడుదల చేస్తే.. తుడా ప్రాజెక్టు తొలి దశ అమలు పూర్తవుతుంది. ఇక చిత్తూరు కార్పొరేషన్లో 30 బస్సుల కొనుగోలుకు రూ.9.15 కోట్లను మంజూరు చేశారు. తుడా ప్రాజెక్టు తొలి దశ అమలు పూర్తై రవాణా కష్టాలు తీరడం ఖాయం. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు విడుదల చేయడం సంస్థకు జీవం పోసినట్లయిందని ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.