
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై సీఎం మోసం
టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పిన టీఆర్‌ఎస్, రెండున్నరేళ్లనుంచి ఏదో ఒక సాకుతో మోసం చేస్తోందని టీడీఎల్పీనేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన పక్కాఇళ్లు డబ్బాల్లాగా ఉన్నాయని, రెండు బెడ్‌రూములతో మంచి ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా 10.70,982 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీటిల్లో 10.2 లక్షల మంది అనర్హులని ప్రభుత్వం తేల్చిందని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకోసం రాష్ట్రంలో కేవలం 51వేల మంది మాత్రమే అర్హులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి నివేదించిందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చేదిలేదని ఈ చర్యతోనే ప్రభుత్వం తేల్చిందన్నారు.