హిందూపురం అర్బన్ : హిందూపురం మండలం సంతేబిదనూర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఎన్నికల సమయంలోనూ, దారికోసం జరిగిన గొడవలను మనసులో ఉంచుకుని టీడీపీ వర్గీయులు ఆర్.హెచ్.గంప్పప్ప, గంగరాజు, రామాంజి, నాగ, వెంకటేష్‌లతోపాటు మరికొందరు శుక్రవారం కర్రలు తదితర మారణాయుధాలతో దాడి చేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంజన్న, రాఘవేంద్ర, ఆవులప్ప తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సంజన్న పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.