- రైతుబజారులో అక్రమాల వెలికితీతతో ఉలిక్కిపడ్డ టీడీపీ నేతలు
- లీలాకృష్ణను అడ్డుకునేందుకు యత్నం
- వైఎస్సార్ సీపీ శ్రేణులపైన దౌర్జన్యం
- విచారణకు వస్తానని గైర్హాజరైన అధికారి
- పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
తమ్ముళ్ల వీరంగం
Published Tue, Dec 27 2016 11:33 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
మండపేట పట్టణంలోని రైతుబజారులో అక్రమాల వెలికితీతతో అధికార పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. విచారణ చేపడతానన్న ఈఓ గైర్హాజరవ్వగా, రైతుబజారు వద్దకు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణను తెలుగు తమ్ముళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుబజారులోకి వచ్చేందుకు మీరెవరంటూ వీరంగం సృష్టించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోగా పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. – మండపేట
ఈ ఏడాది అక్టోబరు 26న మండపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతుబజారును ప్రారంభించారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులు తాము పండించిన కూరగాయాలను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడం వీటి ప్రధాన ఉద్దేశ్యం. మొత్తం 30 షాపులకుగాను స్వయం సహాయక సంఘాలకు ఐదు, దివ్యాంగులకు ఒకటి, ధాన్యం షాపు ఒకటి, మిగిలినవి రైతులకు ఇవ్వాల్సి ఉంది. కాగా రైతుల మాటున అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు, నాయకులకు షాపులను కట్టబెట్టారు. వీరంతా మండపేట,
కపిలేశ్వరపురం మండలాల్లోని పలు గ్రామాల్లో కూరగాయలు పండిస్తున్నట్టుగా రికార్డుల్లో చూపించారు. గడపగడపకూ వైఎస్సార్‌లో భాగంగా సోమవారం రాత్రి 23వ వార్డులో పర్యటిస్తున్న లీలాకృష్ణ రైతుబజారును ఆకస్మిక తనిఖీ చేశారు. షాపులను దక్కించుకున్న తెలుగు తమ్ముళ్లు కొన్నింటిని అద్దెకు ఇచ్చిన్నట్టు వెల్లడి కాగా మరికొందరు బినామీల మాటున నిర్వహిస్తున్నట్టు వెలుగుచూసింది. ఈ విషయమై రైతుబజారు ఎస్టేట్ అధికారి భాస్కర్‌కు ఫో¯ŒSచేయగా మంగళవారం ఉదయం వచ్చి విచారించనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం ఉదయం లీలాకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, పార్టీ నేతలతో కలిసి రైతుబజారుకు చేరుకున్నారు. విచారణ చేసేందుకు ఈఓ రాకపోవడంపై భాస్కర్‌కు ఫో¯ŒSచేయగా తాను రాజమండ్రిలో సమావేశానికి హాజరైనట్టు బదులిచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు అక్కడకు చేరుకున్నారు. రైతుబజారుతో మీకు సంబంధం ఏమిటంటూ హైడ్రామా సృష్టించారు. తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ వ్యాపారస్తులతో పాటు తెలుగు తమ్ముళ్లు హడావిడి చేశారు. లీలాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌరునిగా, ప్రతిపక్ష పార్టీ నాయకునిగా తనకు వచ్చే హక్కు ఉందని లీలాకృష్ణ చెబుతున్నా వారు లెక్కచేయలేదు. విషయం తెలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు రైతుబజారుకు చేరుకుని సిబ్బందితో మాట్లాడారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బయటకు వెళ్లిపోవాలంటూ అధికార పార్టీ నేతల డిమాండ్‌పై లీలాకృష్ణ మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు తాను ఇక్కడే ఉంటానంటూ రైతుబజారు కార్యాలయం వద్ద బైటాయించారు. పట్టణ సీఐ హ్యాపీకృపావందనం, ఎస్సై నజీరుల్లా సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. రైతుబజారు అధికారులతో మాట్లాడేందుకు తాము వస్తే అధికార పార్టీ నేతల వైఖరిని లీలాకృష్ణ, పాపారాయుడు సీఐకు వివరించారు. షాపులు దక్కించుకున్న వారు సాగుచేస్తున్న పొలాలను చూపాలని డిమాండ్ చేశారు. ఆయా పొలాల్లో కూరగాయల సాగు కాకుండా వరిసాగు జరుగుతుంటే దుకాణాలు దక్కించుకున్న వారిని ఖాళీ చేయించి, కూరగాయలు సాగుచేసే రైతులకు కేటాయించాలన్నారు. ఆయా అంశాలపై లిఖితపూర్వకంగా రైతుబజారు అధికారులకు ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. రైతుబజారు ఏఓ బి.సతీష్‌కు వారు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఇరువర్గాల వారిని బయటకు పంపడంతో వివాదం సద్దుమణిగింది.
న్యాయం జరిVó వరకూ పోరాటం : లీలాకృష్ణ
రైతుబజారులో రైతులకు దక్కాల్సిన షాపులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అండదండలతో అధికార పార్టీ నేతలు, వారి బినామీలు వ్యాపారాలు సాగించుకుంటున్నారని లీలాకృష్ణ విమర్శించారు. రాజమండ్రి, రావులపాలెం రైతుబజార్లతో పోలిస్తే కేజీకి దాదాపు నాలుగు రూపాయలు వరకు అధికంగా అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. పాపారాయుడు మాట్లాడుతూ అధికారులు విచారణకు రాకుండా అడ్డుకున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. పార్టీ నాయకులు మేడపాటి బసివిరెడ్డి, పెయ్యల యాకోబు, పొలమాల సత్తిబాబు, ఉండమాటి నాగు పాల్గొన్నారు.
Advertisement
Advertisement