- బయటపడిన టీడీపీ వర్గ విభేదాలు ∙
- ఎంపీటీసీ సభ్యురాలికి దక్కని న్యాయం
- ఎంపీటీసీ భర్తపై పోలీసు జులం
- ఎమ్మెల్యే కొట్టించారని ఎంపీటీసీ ఆరోపణ
భగ్గుమన్న జన్మభూమి
Published Mon, Jan 9 2017 11:57 PM | Last Updated on Tue, Oct 2 2018 6:48 PM
పెదపూడి :
జన్మభూమి గ్రామసభలో టీడీపీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీల మధ్య రాజుకున్న మంట తారాస్థాయికి చేరింది. సోమవారం పెదపూడిలో జరిగిన గ్రామసభలో తనకు న్యాయం చేయాలని ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని వేడుకున్న ఎంపీటీసీ–2 సభ్యురాలు గుణ్ణం వనితకు నిరాశేఎదురైంది. నెల రోజుల క్రితం పెదపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మార్ని రాంబాబు తన చేయిపట్టుకుని సెల్‌ఫో¯ŒS లాక్కుని అవమానించారని, దీనిపై మీరైనా న్యాయం చేయాలని కోరింది. మరోసారి వచ్చి సమస్య పరిష్కరిస్తానని ఎంపీ మురళీమోహ¯ŒS వెళ్లిపోయారు. ఆ వెంటనే ఆమె ఎమ్మెల్యేను వేడుకున్నా పట్టించుకోలేదు. అంతేగాక అక్కడే ఉన్న ఎంపీటీసీ భర్తను ఎస్సై సుమంత్ లాక్కొచ్చి కొట్టి జీపులో ఎక్కించారు. అతనితో పాటు మరో ముగ్గురుని స్టేష¯ŒSకు తీసుకెళ్లారు. ఆ వెనుకే ఎమ్మెల్సీ వర్గీయులు పోలీస్టేçÙ¯ŒSకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అక్కడు రావడంతో రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ వనితా, ఆమె భర్త శ్రీను, తదితరు సోమవారం రాత్రి ఆందోళన చేపట్టారు. కాకినాడ రూరల్ సీఐ పవ¯ŒSకిషోర్ ఎమ్మెల్సీ, ఆందోళనకారులతో చర్చించారు. డిపార్టమెంటల్ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, ఈ విషయం ఉన్నతాధికారులకు నివేధిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. సుమారు 7.30 నుంచి 9.50 వరకు ధర్నా కొనసాగింది.
హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్సీ బొడ్డు
ఎంపీటీసీ భర్తను దౌర్జన్యంగా కొట్టడం అన్యాయమని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అన్నారు. దీనిని చంద్రబాబుకు వివరిస్తానన్నారు. ఎంపీటీసీ, ఆమె భర్త, తదితరులతో కలిసి జిల్లా ఎస్పీని కలిస్తానని ఎమ్మెల్సీ చెప్పారు.
Advertisement