pedapudi
-
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతల వీరంగం
పెదపూడి/చౌడేపల్లె: పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం (ఏపీత్రయం) గ్రామంలోను, చిత్తూరు జిల్లా చౌడేపల్లెలోను ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించటమేగాక వారిని బెదిరించారు. హల్చల్ చేశారు. అచ్యుతాపురత్రయం (ఏపీత్రయం) పంచాయతీలో కరకుదురు 8వ వార్డు మెంబరు పదవికి నామినేషన్ వేసిన కూళ్ల లక్ష్మి మంగళవారం తాను ఉపసంహరించుకుంటున్నట్లు ఫారం–7పై సంతకం చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) సాయిప్రసాద్‌కి ఇచ్చి రసీదు తీసుకెళ్లారు. గంట తర్వాత వచ్చి తనతో కొందరు బలవంతంగా ఉపసంహరింపజేశారని ఆర్వోకి చెప్పారు. ఆమె వెంట ఉన్న టీడీపీ నేతలు చిన్న అబ్బాయి, వెంకటేష్, రాము, రాంబాబు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసుప్రసాద్, వీర వెంకట సత్యనారాయణ, పి.వరాహనరసింహస్వామి, నాగతిరుపతిరావు,బుజ్జి జోక్యం చేసుకుని.. తమకు తెలియకుండా ఎలా విత్ డ్రా చేస్తారంటూ గందరగోళం సృష్టించారు. టేబుల్‌పై ఉన్న ఫారం–7ను చింపేసి ఆర్వోను హెచ్చరించి వెళ్లారు. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల సహాయ అధికారి పి.విజయభాస్కర్‌కు, ఎస్సై టి.క్రాంతికుమార్‌కు ఆర్వో సమాచారం అందించారు. చౌడేపల్లిలో ఎంపీడీవో కార్యాలయం వద్ద అడ్డంగా నిలుచున్న టీడీపీ నేతలు విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ నేతలపై కేసు ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలపై చౌడేపల్లె మండలంలో మంగళవారం కేసు నమోదైంది. ఎంపీడీవో వెంకటరత్నం కథనం మేరకు.. ఎంపీడీవో సోమవారం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండగా తెలుగుదేశం నాయకులు ఎన్.శ్రీనాథరెడ్డి, జి.రమేష్‌రెడ్డి, ఎ.రామచంద్ర తమ అనుచరులతో కలసి కార్యాలయంలోకి వచ్చారు. తమ పార్టీ నాయకులకు నోడ్యూస్ సర్టిఫికెట్లు జారీచేయడానికి పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేరని ఫిర్యాదుచేశారు. ఎంపీడీవో సమాధానం చెబుతుండగానే వారు దుర్భాషలాడారు. ఆయనతోపాటు పంచాయతీ కార్యదర్శులను బెదిరించారు. దీనిపై ఎంపీడీవో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అందిన ఫిర్యాదు మేరకు ముగ్గురు టీడీపీ నాయకులపై సెక్షన్ 353, 506 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణమోహన్ చెప్పారు. -
చివరి మజిలీలో నరకయాతన
పి.గన్నవరం మండలం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేటలో కనిపించిన విషాద దృశ్యమిది. గ్రామానికి చెందిన గిడ్డి పల్లాలమ్మ (70) ఆదివారం మృతి చెందింది. గ్రామంలోని ప్రధాన పంట కాలువకు ఆవల ఉన్న లంకను గ్రామస్తులు మరుభూమిగా వినియోగిస్తున్నారు. అక్కడకు వెళ్లేందుకు ఏడేళ్ల కిందట చేపట్టిన వంతెన నిర్మాణాన్ని పాలకులు నేటికీ పూర్తి చేయలేదు. దీంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని కాలువ ఆవలి ఒడ్డుకు చేర్చేందుకు గ్రామస్తులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. పల్లాలమ్మ మృతదేహాన్ని అరటి తెప్పపై ఉంచి, కాలువ ఈదుతూ దాటిస్తున్న యువకులను చిత్రంలో చూడవచ్చు. – పి.గన్నవరం -
భగ్గుమన్న జన్మభూమి
బయటపడిన టీడీపీ వర్గ విభేదాలు ∙ ఎంపీటీసీ సభ్యురాలికి దక్కని న్యాయం ఎంపీటీసీ భర్తపై పోలీసు జులం ఎమ్మెల్యే కొట్టించారని ఎంపీటీసీ ఆరోపణ పెదపూడి : జన్మభూమి గ్రామసభలో టీడీపీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీల మధ్య రాజుకున్న మంట తారాస్థాయికి చేరింది. సోమవారం పెదపూడిలో జరిగిన గ్రామసభలో తనకు న్యాయం చేయాలని ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని వేడుకున్న ఎంపీటీసీ–2 సభ్యురాలు గుణ్ణం వనితకు నిరాశేఎదురైంది. నెల రోజుల క్రితం పెదపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మార్ని రాంబాబు తన చేయిపట్టుకుని సెల్ఫో¯ŒS లాక్కుని అవమానించారని, దీనిపై మీరైనా న్యాయం చేయాలని కోరింది. మరోసారి వచ్చి సమస్య పరిష్కరిస్తానని ఎంపీ మురళీమోహ¯ŒS వెళ్లిపోయారు. ఆ వెంటనే ఆమె ఎమ్మెల్యేను వేడుకున్నా పట్టించుకోలేదు. అంతేగాక అక్కడే ఉన్న ఎంపీటీసీ భర్తను ఎస్సై సుమంత్ లాక్కొచ్చి కొట్టి జీపులో ఎక్కించారు. అతనితో పాటు మరో ముగ్గురుని స్టేష¯ŒSకు తీసుకెళ్లారు. ఆ వెనుకే ఎమ్మెల్సీ వర్గీయులు పోలీస్టేçÙ¯ŒSకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అక్కడు రావడంతో రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ వనితా, ఆమె భర్త శ్రీను, తదితరు సోమవారం రాత్రి ఆందోళన చేపట్టారు. కాకినాడ రూరల్ సీఐ పవ¯ŒSకిషోర్ ఎమ్మెల్సీ, ఆందోళనకారులతో చర్చించారు. డిపార్టమెంటల్ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, ఈ విషయం ఉన్నతాధికారులకు నివేధిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. సుమారు 7.30 నుంచి 9.50 వరకు ధర్నా కొనసాగింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్సీ బొడ్డు ఎంపీటీసీ భర్తను దౌర్జన్యంగా కొట్టడం అన్యాయమని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అన్నారు. దీనిని చంద్రబాబుకు వివరిస్తానన్నారు. ఎంపీటీసీ, ఆమె భర్త, తదితరులతో కలిసి జిల్లా ఎస్పీని కలిస్తానని ఎమ్మెల్సీ చెప్పారు. -
తస్మదీయుని ఇంటికి వెళితే ధర్నా చేస్తా..
మంత్రి కామినేనికి ఎమ్మెల్సీ బొడ్డు హెచ్చరిక పెదపూడి : పెద్దాడ వచ్చిన మంత్రి శ్రీనివాస్ తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం టీడీపీ నేత బొడ్డు సత్తిరాజు(పార్టీలోఎమ్మెల్యే వర్గం) ఇంటి వద్ద అల్పాహారానికి వెళ్లబోయారు. ఎమ్మెల్సీ భాస్కరరామారావు అందుకు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఎమ్మెల్సీగా ఉండి గ్రామంలో కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ చేసిన తన ఇంటికే రావాలని, లేకుంటే శంకుస్థాపన చేసి అనంతరం సత్తిరాజు ఇంటికి వెళ్లాలని చెప్పారు. ఇద్దరూ కావలసిన వారేనని, ఎంపీ మురళీ మోహ¯ŒS కూడా అక్కడే ఉన్నందున అక్కడికి వెళ్లి వస్తానని చెప్పారు. ససేమిరా అన్న భాస్కరరామారావు అక్కడికి వెళితే తాను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి వెళ్లిపోతానని, అవసరమైతే ధర్నా చేస్తానని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మంత్రి శంకుస్థాపన స్థలానికి బయలు దేరారు. అప్పటికే అక్కడికి టీడీపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల వారు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. మంత్రి ఫో¯ŒS చేయడంతో మురళీమోహ¯ŒS అక్కడికి వచ్చాక అందరూ కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. -
‘బుక్ ఆఫ్ ఎవరెస్ట్’లో యువరాజారెడ్డి
పెదపూడి : జి.మామిడాడకు చెందిన పీఈటీ ఉపాధ్యాయుడు, లయన్స క్లబ్ సభ్యుడు ద్వారంపూడి యువరాజారెడ్డి బుక్ ఆఫ్ ఎవరెస్ట్ ప్రపంచ రికార్డులో స్థానం సాధించారు. గత శ్రీరామ నవమి సందర్భంగా 12,345 బియ్యం గింజలపై శ్రీరామనామాన్ని తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా రాశారు. వీటిని రికార్డుల సేకరణ సంఘం(ఇన్వోరాన్స్) అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చింతా శ్యామ్‌కుమార్ పరిశీలించి అవార్డుకు సిఫార్సు చేశారు. నేపాల్‌కు చెందిన బుక్ ఆఫ్ ఎవరెస్ట్ చీఫ్ ఎడిటర్ మధుకుమార్ ప్రేష్ట ధ్రువపత్రం జారీ చేశారు. దానిని లయన్స్ ఇంటర్నేషనల్ డెరైక్టర్ ఆర్ సునీల్‌కుమార్ చేతుల మీదుగా ఈ నెల 20న మండపేటలో జరిగిన కార్యక్రమంలో యువరాజారెడ్డి అందుకున్నారు. లయన్స్ గవర్నర్ డి.తిరుమలరావు, బాదం ఐ, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు బాదం బాలకృష్ణ, బీ ఛత్రపతి శివాజీ, మండ రాజారెడ్డి పాల్గొన్నారు.