మృతి చెందిన టెక్నీషియన్ మాస్కో
కేటీపీఎస్‌లో ప్రమాదం
పాల్వంచ:
కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో మంగళవారం ప్రమాదశాత్తు బాయిలర్‌పై నుంచి పడి ఓ టెక్నీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. కేటీపీఎస్ 5వ దశలో 250 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్‌లో పదిరోజులుగా ఓవరాల్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల నిర్వహణ కోసం తమిళనాడు రాష్ట్రం తిరుచునాపల్లికి చెందిన బీహెచ్‌ఈఎల్ రిటైర్డ్ ఇంజనీర్, బాయిలర్ టెక్నీషియన్ జి.మాస్కో వారం క్రితం ఇక్కడికి వచ్చాడు. ఓవరాల్ పనులను బాయిలర్ వద్ద నిర్వహిస్తున్న సమయంలో పది మీటర్ల ఎత్తు నుంచి ప్రమాదశాత్తు జారి పడ్డాడు. అతని తల, ఛాతి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే పనిచేస్తున్న సిబ్బంది హుటాహుటిన కేటీపీఎస్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్త్రావమై మృతి చెందాడు. మృతదేహాన్ని సీఈ పి. రత్నాకర్, ఎస్‌పీఎఫ్ డీఎస్పీ రంగరాజు భాస్కర్, పట్టణ ఎస్సై పి. సత్యనారాయణరెడ్డి సందర్శించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.