masko
-
బ్రిక్స్ సదస్సు వేళ.. రష్యాపై భారీ సైబర్ దాడి
మాస్కో: రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.‘‘రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై ఈ బుధవారం ఉదయం విదేశాల నుంచి భారీ సైబర్‌టాక్ ప్రారంభమైంది. అయితే.. మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి విదేశీ సైబర్ దాడులను శక్తిమంతంగా ఎదుర్కొంటోంది. అయితే బుధవారం చేసిన సైబర్ దాడి మాత్రం చాలా తీవ్రమైంది’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆంక్షలను లెక్కచేయకుండా మాస్కో ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను అక్టోబర్ 22-24 తేదీల్లో రష్యాలోని కజాన్‌లో జరుపుతోంది.Russian Foreign Ministry suffers ‘unprecedented’ #cyberattack - spox ZakharovaSpecialists are working to restore the functionality of the Russian Foreign Ministry's website after a large-scale DDoS attack, ministry spokesperson Maria Zakharova told TASS.The attack...RTNews pic.twitter.com/RS2ilmEhVJ— TifaniesweTs (@TifaniesweTs) October 23, 2024 రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కజన్ నగరంలో జరుగుతున్న ‘బ్రిక్స్’ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.చదవండి: PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు -
Putin: ‘మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్‌తో లింక్’
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. మాస్కోలో చోటు చేసుకున్న నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదలకు ఉక్రెయిన్‌తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ‘మాస్కోలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ వైపు పారిపోవడానికి యత్నించారు. తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఉక్రెయిన్-రష్యా సరిహద్దులను క్రాస్ చేసి ఉక్రెయిన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు’ పుతిన్ స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ ఆరోపించారు. ‘ఈ ఉగ్రదాడి వల్ల వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాధకరమైన రోజు. ఈ దారుణమైన దాడికి పాల్పన వ్యక్తులు, ఉగ్రసంస్థలను శిక్షిస్తాం. వారు ఎవరైనా.. వారికి వెనక ఎవరున్నా కోరుకోం. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తాం. రష్యా ప్రజలకు వ్యతిరేకంగా దాడులకు ప్రణాళిక వేసిన వారిని గుర్తించి శిక్షిస్తాం’ అని పుతిన్ హెచ్చరించారు. మాస్కో దాడి వెనకాల ఉక్రెయిన్‌కు లింక్ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ‘మాస్కో ఉగ్రదాడిలో ఉక్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఉగ్రదాడికి మాకు లింక్ ఉందన్న ఆరోపణలు నిరాధారమైనవి’ అన ఉక్రెయిన్ మిలిటరీ స్పై ఏజెన్సీ స్పష్టం చేసింది. రష్యాలోని మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 133 మంది మరణించారు. వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మరోవైపు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
Russia: మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను అరెస్టు
లక్నో: రష్యా రాజధాని మాస్కో లోని భారత దౌత్య కార్యాలయంలో కీలక విధుల్లో ఉంటూ పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐకి కీలక సమాచారం చేరవేస్తున్న ఓ అధికారి ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఏటీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్ విదేశాంగ శాఖ ఉద్యోగి. ఇతడు మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఐబీఎస్ఏ)గా పనిచేస్తూ 2021 నుంచి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో టచ్‌లో ఉంటూ రక్షణ శాఖ కార్యకలాపాలు, విదేశాంగ శాఖ వ్యవహారా లు, భారత సైన్యం కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేస్తు న్నాడు. కీలక సమాచారం అందిస్తే భారీగా ప్రతిఫలం ముట్టజెపుతామంటూ పలువురు ఇతర అధికారులను సైతం తన వైపు తిప్పుకునేందుకు సతేంద్ర ప్రయత్నిస్తున్నట్లు యూపీ ఏటీఎస్‌కు ఉప్పందింది. దీంతో, ఏటీఎస్ బృందం ఇతడి కదలికలు, కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచింది. ఆ మేరకు నిబంధనల ప్రకారం ఇతడిని ఇటీవల మీరట్‌లోని ఫీల్డ్ యూనిట్‌కు రప్పించి అధికారులు విచారించారు. నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించడంతో సతేంద్ర సివాల్‌పై ఐపీసీ సెక్షన్ 121ఏతో పాటు అధికార రహస్యాల చట్టం–1923 కింద కేసులు నమోదు చేసినట్లు ఏటీఎస్ వివరించింది. ఇదీ చదవండి: రాష్ట్ర హోదా కోసం లఢక్‌లో భారీ నిరసనలు -
పుతిన్ సంపాదన ఇంత తక్కువా?
వ్లాదిమిర్ పుతిన్ ఆరేళ్లుగా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన ఆదాయ వివరాలు వెల్లడి కావడం.. ఆ వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పత్రాల్లో ఆదాయం, ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తాజాగా ఆయన అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పబ్లిష్ చేసింది. గత ఆరేళ్ల నుంచి ఆయన ఆస్తుల విలువ 67.6 మిలియన్ రెబెల్స్ (7,53,000 ఆమెరికన్ డాలర్లు)గా పుతిన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018 నుంచి 2024 వరకు పుతిన్ సంపాధించిన ఆస్తుల విలువ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పత్రాల వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ డిపాజిట్లు, మిలిటరీ పెన్షన్, పలు స్థలాల అమ్మకం ద్వారా లభించిన మొత్తంగా తెలుస్తోంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి వార్షిక జీతమే 4,00,000 అమెరికన్ డాలర్లు. ఈ లెక్క ప్రకారం రష్యా అధ్యక్షుడి వార్షిక ఆదాయం అమెరికా అధ్యక్షుడి కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. రష్యా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. పుతిన్ పది వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో 54.5 మిలియన్ రెబెల్స్( 606,000 అమెరికన్ డాలర్లు) నగదు కలిగి ఉన్నారు. ఆయన ఐదు సొంత వాహనాలు కూడా ఉన్నాయి. అందులో రెండు పాతకాలం సోవియట్ యూనియన్ కార్లు GAZ M-21s ఉన్నాయి. 2009లో రష్యా తయారైన 4x4 కారు, 1987 నాటి క్యాంపింగ్ ట్రైలర్ ఉన్నాయి. పుతిన్ మాస్కోలో ఒక అపార్టుమెంట్, సెయింట్ పిరట్స్బర్గ్లో ఒక అపార్టుమెంట్, గ్యారేజ్ కలిగి ఉన్నారు. అయితే పుతిన్ ఫిన్లాండ్ సరిహద్దుల్లో రహస్య నివాసం ఉందని స్థానిక మాస్కో టైమ్స్ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం ప్రచురించిన ఒక్క రోజు తర్వాత పుతిన్ ఆదాయ, ఆస్తుల విషయాలు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వెల్లడికావటంపై చర్చ జరుగుతోంది. కరేలియాలోని లేక్ లడోగా నేషనల్ పార్క్‌లో పుతిన్ అత్యధునిమైన రహస్య నివాసాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది. వివాలవంతమైన సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. ఇక.. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 15 నుండి 17 వరకు మూడు రోజుల్లో జరుగనున్నాయి. 2020లో వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణను అనుసరించి పుతిన్(71) కనీసం 2036 వరకు అధికారంలో కొనసాగవచ్చు. -
అంతరిక్షంలో సినిమా షూటింగ్ సక్సెస్
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజుల పాటు సినిమా షూటింగ్ విజయవంతంగా ముగించుకుని రష్యా సినిమా బృందం తిరిగి భూమికి చేరుకుంది. ఒలెగ్ నోవిట్స్కీ, యులియా పెరెసిల్డ్, క్లిమ్ షిపెంకోలతో కూడిన సోయుజ్ అంతరిక్ష నౌక ఆదివారం కజఖ్‌స్తాన్‌లోని మైదాన ప్రాంతంలో దిగింది. ఆ వెంటనే యులియా, నోవిట్స్కీలు సీట్లలో ఉండగానే 10 నిమిషాలపాటు సినిమాలోని కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ ముగ్గురూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దర్శకుడు షిపెంకో చాలెంజ్ అనే సినిమా చిత్రీకరణ కోసం నటి యులియాతో కలిసి ఈ నెల 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. సర్జన్ పాత్ర పోషిస్తున్న యులియా అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ వ్యోమగామికి అత్యవసర చికిత్స చేసే సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. అనారోగ్యం బారిన పడిన వ్యోమగామి పాత్రను ఇప్పటికే 6 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న నోవిట్స్కీ పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోందని, సినిమా రిలీజ్ ముహూర్తం ఖరారు కాలేదని సమాచారం. -
రెండేళ్ల పరిచయం.. 105 మంది పిల్లలు కావాలి!
ఆమె వయసు 23. ఆయనకు 56. ఆమె తన ఆరేళ్ల కూతుర్ని వెంటపెట్టుకుని నల్ల సముద్ర తీర ప్రాంతంలో విహారానికి వెళ్లినప్పుడు తొలిసారి ఆయన్ని చూసింది. ఆయన తనను చూసి ‘హాయ్’ అన్నప్పుడు ఆ కళ్లలో తనపై కనిపించిన ప్రేమను చూసింది. ఆమె సింగిల్ మదర్. ఆయన పెళ్లయిన పెద్ద మనిషి. ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ‘ఏదైనా కోరుకో హృదయేశ్వరీ..’ అని భార్యకు వరమిచ్చాడు భర్త. ఆయన బిలియనీర్. అందుకు వరం ఇవ్వడం కాదు. ఆమె మీద ఆయనకు ఉన్న ప్రేమ అంతకన్నా సంపన్నమైనది! ‘‘నాకు 105 మంది పిల్లలు కావాలి..’’ అందామె! దానర్థం.. ‘‘నిన్నే కోరుకున్నా.. నీ ప్రతి రూపాలే నాకు నూటా అయిదు కావాలి’’ అని. గత ఏడాదిలో వాళ్లకు పది మంది పిల్లలు పుట్టారు. మిగతా పిల్లల్ని కొంత గ్యాప్ తర్వాత ప్లాన్ చేసుకుంటుందట ఆమె. ఇక్కడ చూడండి.. పిల్లల్లో పిల్లలా కలిసిపోయి ఆ తల్లి ఎలా నవ్వులు చిందిస్తోందో!! ఆ ఇరవై మూడేళ్ల అమ్మాయి పేరు క్రిస్టీనా ఆజ్టర్క్. ఇక నుంచి క్రిస్టీనా అందాం. రష్యన్ తను. మాస్కోలో ఉండేది. ఆ యాభై ఆరేళ్ల పెద్దాయన పేరు గాలిప్ ఆజ్టర్క్. ఇక నుంచి గాలిప్ అందాం. జార్జియా తనది. ఒకప్పుడు రష్యన్ భూభాగం. ఇప్పుడు ప్రత్యేక దేశం. ఆ దేశంలోని నల్ల సముద్ర తీరప్రాంతమైన బటూమీ పట్టణంలో ఉంటారు ఆయన. ట్రావెల్ మేగ్నెట్. కనుక మిలియనీర్. దేవుడు ఎలా కలుపుతాడో చూడండి. ఇద్దర్నీ కలిపాడు. ఇద్దరూ కలిసి ఇప్పుడు బటూమీలో ఉంటున్నారు. భర్త ఎక్కడుంటే అక్కడే కదా భార్య ఉండేది. అందుకే మాస్కో నుంచి తన ఆరేళ్ల కూతురు వికాతో పాటు గాలిప్ దగ్గరికి వచ్చేసింది క్రిస్టీనా. ఇప్పటి వరకు ఇదంతా ఒక మామూలు విషయం. లోకంలో అనేకం ఉంటాయి.. ‘నువ్వాదరిని, నేనీదరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనుకునే జంటలు. వీళ్ల స్టోరీ ప్రత్యేకమైనది. ఆసక్తి కలిగించేది. అయితే స్టోరీ మొత్తం చదివినా సమాధానం లభించని రెండు ప్రశ్నలైతే మీకు మిగిలిపోతాయి. క్రిస్టీనాకు పదిహేడేళ్ల వయసుకే పుట్టిన కూతురు ‘వికా’ కు తండ్రి ఎవరన్నది, గాలిప్ భార్యా బిడ్డలు ఎవరన్నది. ఈ దంపతులు ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు కనుక అడిగి బలవంత పెట్టడం మర్యాద కాదు. ప్రస్తుతం అయితే వీళ్లకు పదిమంది పిల్లలు! వికా తో కలిపి పదకొండు మంది. ఇక కథలోకి వెళ్దాం. పిల్లల్లో ఒకరిగా క్రిస్టీనా క్రిస్టీనాకు, గాలిప్కు పరిచయం అయింది రెండేళ్ల క్రితమే. కూతుర్ని తీసుకుని మాస్కో నుంచి నల్ల సముద్రానికి విహారానికి వచ్చినప్పుడు ఒడ్డున ఉన్న ఆ ఇసుకలో వారి చూపులు కలిశాయి. ‘నాకనిపించిందీ.. తను నా కోసమే పుట్టింది’ అని ఇప్పటికీ ఆశ్చర్యంగా చెబుతుంటారు గాలిప్. ఇక క్రిస్టీనా అయితే ‘ఆయనలో తెలియని ఆకర్షణ ఏదో నన్ను ఆయన వైపు లాగేసింది’ అంటారు. కాబట్టి.. వయసును పక్కన పెట్టి చూస్తే వీళ్లు చూడచక్కని జంట. ఆయనకు ఆస్తులు, అంతస్తులు, ఇంకా అలాంటివేవో కోట్ల కొద్దీ ఉన్నాయి. కానీ క్రిస్టీనా.. ‘నిన్నే కోరుకున్నా’ అన్నారు. ‘నన్ను సరే, ఏదైనా కోరుకో’ అన్నారు ఆయన. దేవుడు వరం ఇస్తానంటే మొహమాటపడాలి. భర్త వరం ఇస్తానంటే ఎగిరి భుజంపై కూర్చోడానికి వెనకాముందూ చూడక్కర్లేదు. ‘నీలాంటి పిల్లలు కావాలి. వంద మంది కావాలి. వంద మంది కాదు. వందా ఐదు మంది’ అంది క్రిస్టీనా. ‘ఓ బేబీ’ అని మురిసిపోయారు గాలిప్. ‘అదేం లెక్కా.. వన్నాట్ వైఫ్’ అని ఆయనేం ఆశ్చర్యపోలేదు. ‘ఓకే.. ప్లాన్ చేద్దాం’ అన్నారు. ప్లాన్ చేస్తే అయ్యే పనా! అయినా ప్లాన్ చేశారాయన. పదిమంది సరోగేట్ మదర్స్‌ని వెదికి రెండేళ్ల వ్యవధిలో పదిమంది బిడ్డల్ని ఆమె చేతికి అందించాడు. అండం ఆమెది. శుక్రకణం అతడిది. గర్భం వేరే స్త్రీది. ఇప్పుడా ఇల్లు క్రిస్టీనా సొంత కూతురు విగాతో, పాటు గాలిప్‌తో కలిగిన పది మంది శిశువుల కేరింతలతో బెలూన్లు ఎగురుతున్నట్లుగా కళకళలాడుతోంది. మొదటి బిడ్డ ముస్తాఫా 2020 మార్చి 10 పుట్టాడు. పదో బిడ్డ ఒలీవియా 2021 జనవరి 16 న పుట్టింది. మరి క్రిస్టీనా కోరుకున్న వరంలోని మిగతా 95 మంది మాటేమిటి! ‘కాస్త ఆగుతాను’ అంటోంది క్రిస్టీనా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూ. మొదటైతే.. ‘ఏడాదికో బిడ్డను కంటాను..’ అని పట్టింది. క్రిస్టీనా. గాలిప్ ఒప్పుకోలేదు. ‘మన బిడ్డలే కదా నీకు కావలసిందీ’ అని సరోగసీ ఐడియా చెప్పారు. పిల్లల కోసం కొని పెట్టిన పుస్తకాలతో క్రిస్టీనా, ∙భర్తతో క్రిస్టీనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయా చొప్పున పదిమంది ఆయాలు ఉన్నారు! వాళ్లందరి సంరక్షణను వారికే అప్పగించింది క్రిస్టీనా. అయితే తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. అందరికీ ఒకటే నిద్ర టైమ్. రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు. అలా వారికి అలవాటు చేయించింది. శిశువుల్లో కవలలు, ఒకే పోలికలు ఉన్నవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ.. ‘హూ ఈజ్ హూ..’ అన్నది పేర్లతో చెప్పేస్తుంది క్రిస్టీనా. ‘వంద మంది పిల్లలైనా కనిపెట్టేస్తాను’ అని నవ్వుతూ అంటోంది తను. ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకుంటోంది. ‘పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవడం తేలికైన సంగతి కాదు. ఈ పది మందీ కొంచెం పెద్దయ్యాకే మరికొంత మంది పిల్లల కోసం ప్రయత్నిస్తాను’’అంటోంది. ఆరేళ్ల కూతురుకి కూడా ఆ పిల్లల చిన్నచిన్న పనులు అప్పజెబుతోంది. ఇక పిల్లలకు ఏం చదివి వినిపించాలి, ఏ వేళకు వారికి ఏ పని చేయాలి అనేవి క్రిస్టీనానే ఆయాలకు చెబుతంటుంది. ఏడుస్తున్న పిల్లల్ని మాత్రం ఆయాలను ఎత్తుకోనివ్వదు. తనే దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. ఫుడ్డు కూడా గ్రాముల్లోనే. ఒక గ్రాము తక్కువా కాదు. ఒక గ్రాము ఎక్కువా కాదు. ఆయాలకు ఇంకొక పని కూడా ఉంది. తడిసిన డయపర్లను ఫొటో తీయడం. ఆ తడి కలర్‌ని బట్టి బిడ్డల ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది క్రిస్టీనా. ప్రతి శిశువుకూ ఒక డైరీ ఉంటుంది. అందులో ఆ శిశువు వివరాలన్నీ ఏ రోజుకారోజు ఆయాలు నోట్ చేస్తుంటారు. వాళ్లేం తిన్నారు, ఎంత తిన్నారు, ఎన్ని గంటలకు నిద్రలోకి ఒరిగిపోయారు, తిరిగి ఎన్ని గంటలకు నిద్ర లేచారు. మధ్యతో ఎన్నిసార్లు మేల్కొన్నారు.. ఇలా ప్రతి వివరమూ ఉంటుంది. ఇటీవల క్రిస్టీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘మా ఇల్లు నందనవనం, ప్రశాంత నిలయం. నేనూ నా భర్త ఇంట్లో సినిమాలు, కార్టూన్ షోలు చూస్తాం. పిల్లలకు పెట్టం గానీ మేమిద్దరం జంక్‌ఫుడ్ తింటాం.. (ఆ ఆరేళ్ల పిల్లకు కొద్దిగా పెడతారేమో!), బ్యాక్‌గామన్ గేమ్ ఆడతాం.. ఇంకా పిల్లలందరితో కలిసి వాకింగ్ చేస్తాం..’’ అని షేర్ చేసుకున్నారు. నిజంగా పంచుకుంటే పెరిగే సంతోషమే ఇది. పిల్లలు, పిల్లల్లాంటి పెద్దలు ఎక్కడున్నా వారి ప్రేమ వెలుగులు భూగోళమంతా ప్రసరిస్తూ ఉంటాయి. -
ట్రంప్‌పై నెటిజన్లు ఫైర్, భాధ్యతలేకుండా...
వాషింగ్టన్: కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (అక్టోబర్ 5) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వైట్ హౌస్‌కు వచ్చారు. ఆయన ఫోటో కోసం మీడియా అడగగా ఆయన మాస్క్ తీసి ఫోటోకు ఫోజులిచ్చారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకుండానే ట్రంప్ ఇలా మాస్క్ తీయడం చూసి నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో ట్రంప్ ఫోటోలు అందుబాటులో ఉన్నారు. వాటిలో ఆయన వైట్ హౌస్ వద్ద మెట్లు ఎక్కడం లాంటి ఫోటోలు ఉన్నాయి. అప్పుడు కూడా ట్రంప్ మాస్క్ తొలగించే ఉన్నారు. మాస్క్ లేకుండానే ట్రంప్ ఊపిరి పీల్చుకోవడం వదలడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇది చూసిన ఒక నెటిజన్ మెట్లు ఎక్కే సమయంలో ట్రంప్ ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో మాస్క్‌ను తొలగించినట్లు కనిపిస్తోంది అని కామెంట్ చేశాడు. ఫోటో కోసం ట్రంప్ మాస్క్ తీసివేయడంపై నెటిజన్లు మండిపడుతున్నాడు. ఇలా చేయడం ద్వారా ట్రంప్ తన కుటుంబాన్ని, సిబ్బందిని కరోనా బారిన పడేలా చేశారు అంటూ మండిపడుతున్నారు. చదవండి: ట్రంప్ ఓకే- యూఎస్ మార్కెట్లు అప్ -
‘అలా ప్రయాణించడమే సౌకర్యం’
విమానంలో నగ్న ప్రయాణమే సౌకర్యంగా ఉంటుందని అనుకున్నాడో వింత ప్రయాణికుడు. అనుకున్నదే తడవుగా ఒంటి మీద ఎటువంటి ఆచ్ఛాదన (బట్టలు) కూడా లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. మెల్లిగా చెక్ఇన్ అయ్యే ప్రాంతం వరకూ వెళ్లాడు. కానీ పోలీసుల కంటపడ్డాడు. అసహ్యమైన చర్యకు గాను పోలీసలు సదరు ప్రయాణికుడి వీపు విమానం మోత మోగించారు. మాస్కో: నగ్నంగా ప్రయాణించాలనే కోరికతో ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు లేకుండా తిరుగుతున్న వ్యక్తి అరెస్టైన సంఘటన రష్యాలో జరిగింది. ‘శరీరంపై బట్టలు లేకుండా చేసే ప్రయాణం చాలా సుఖవంతం, సౌకర్యంగా ఉంటుంద’ని అరెస్ట్ అయిన ప్రయాణికుడు చెప్పడం విశేషం. ఆ ప్రయాణికుడిది రష్యాలోని యకుస్త్క్ ప్రాంతమని తెలుస్తోంది. అతడు మద్యం సేవించలేదని, పోలీసుల మందలింపు తర్వాత మానసిక చికిత్స కోసం ఆ ప్రయాణికుడ్ని విమానాశ్రయంలోని ఆస్పత్రిలో చేర్పించామని రష్యా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మీడియాకు తెలిపారు. ఇటీవలే అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ఒక సౌదీ ప్రయాణికురాలు తన బిడ్డను అక్కడి వెయిటింగ్ రూమ్‌లోనే మరిచిపోయి వెళ్లాల్సిన ఫ్లయిట్ ఎక్కేసింది. విషయాన్ని గుర్తించిన మహిళ లబోదిబోమంటూ విమానాన్ని వెనక్కి తిప్పాల్సిందిగా పైలట్‌ను ఇబ్బందికి గురిచేసింది. మహిళ మతిమరుపు కాస్తా అధికారుల చావుకొచ్చింది. -
బాయిలర్ పైనుంచి పడి టెక్నీషియన్ మృతి
కేటీపీఎస్‌లో ప్రమాదం పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో మంగళవారం ప్రమాదశాత్తు బాయిలర్‌పై నుంచి పడి ఓ టెక్నీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. కేటీపీఎస్ 5వ దశలో 250 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్లో పదిరోజులుగా ఓవరాల్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల నిర్వహణ కోసం తమిళనాడు రాష్ట్రం తిరుచునాపల్లికి చెందిన బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఇంజనీర్, బాయిలర్ టెక్నీషియన్ జి.మాస్కో వారం క్రితం ఇక్కడికి వచ్చాడు. ఓవరాల్ పనులను బాయిలర్ వద్ద నిర్వహిస్తున్న సమయంలో పది మీటర్ల ఎత్తు నుంచి ప్రమాదశాత్తు జారి పడ్డాడు. అతని తల, ఛాతి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే పనిచేస్తున్న సిబ్బంది హుటాహుటిన కేటీపీఎస్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్త్రావమై మృతి చెందాడు. మృతదేహాన్ని సీఈ పి. రత్నాకర్, ఎస్పీఎఫ్ డీఎస్పీ రంగరాజు భాస్కర్, పట్టణ ఎస్సై పి. సత్యనారాయణరెడ్డి సందర్శించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.