బ్రిక్స్‌ సదస్సు వేళ.. రష్యాపై భారీ సైబర్‌ దాడి | Russian Foreign Ministry Hit By Massive Cyber Attacks Amid BRICS Summit, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ సదస్సు వేళ.. రష్యాపై భారీ సైబర్‌ దాడి

Published Thu, Oct 24 2024 7:29 AM | Last Updated on Thu, Oct 24 2024 10:11 AM

Russian Foreign Ministry Hit By Massive Cyberattacks

మాస్కో: రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్‌ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.

‘‘రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు. అధికారిక వెబ్‌సైట్, మౌలిక సదుపాయాలపై ఈ బుధవారం ఉదయం విదేశాల నుంచి భారీ సైబర్‌టాక్ ప్రారంభమైంది. అయితే.. మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి  విదేశీ సైబర్‌ దాడులను శక్తిమంతంగా ఎదుర్కొంటోంది. అయితే బుధవారం చేసిన సైబర్‌ దాడి మాత్రం చాలా తీవ్రమైంది’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆంక్షలను లెక్కచేయకుండా మాస్కో ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను అక్టోబర్ 22-24 తేదీల్లో రష్యాలోని కజాన్‌లో జరుపుతోంది.

 

రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కజన్‌ నగరంలో జరుగుతున్న ‘బ్రిక్స్‌’ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్‌ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని  కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.

చదవండి:  PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement