రసూల్‌పురా (హైదరాబాద్) : ఉద్యోగానికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... బోయిన్‌పల్లి చినతోకట్ట సంజీవయ్యకాలనీలో ఉండే బి. ప్రభాకర్ కుమార్తె మౌనిక(19) ఓ ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తోంది.
కాగా ఆమె ఈ నెల 6వ తేదీన ఉద్యోగానికి వెళుతున్నానంటూ ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. అయితే సాయంత్రం ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమైన యువతి
Published Thu, Jul 9 2015 8:18 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM
Advertisement
Advertisement