వారం రోజులతో పోల్చుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గురువారం స్వల్పంగా పెరిగాయి.
అనంతపురం అగ్రికల్చర్ : వారం రోజులతో పోల్చుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అనంతపురం 37.6 డిగ్రీలు అత్యధికం కాగా, కూడేరు 36.7 డిగ్రీలు, శెట్టూరు, ఉరవకొండ, బత్తలపల్లి 36.4 డిగ్రీలు, బుక్కపట్నం 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో గరిష్టంగా 34 నుంచి 36 డిగ్రీలు, కనిష్టంగా 25 నుంచి 27 డిగ్రీల మధ్య కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 75, మధ్యాహ్నం 35 నుంచి 45 శాతం మధ్య రికార్డయ్యింది.
గాలులు గంటకు 8 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో వీచాయి. తనకల్లు, గుత్తి, తాడిపత్రి, గుంతకల్లు, యాడికి, శింగనమల, పుట్లూరు, వజ్రకరూరు, కూడేరు, గార్లదిన్నె, కనేకల్లు తదితర మండలాల్లో తుంపర్లు పడ్డాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 40 మి.మీ నమోదైంది. నైరుతి రుతుపవనాలు జిల్లా అంతటా విస్తరించడం, ఆకాశం మేఘావృతమవుతున్నా చెప్పుకోదగ్గ వర్షం పడలేదు.