రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రాంతంలో అగ్రికల్చర్ జోన్ పై అపోహలు వద్దని మంత్రి నారాయణ తెలిపారు.
విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రాంతంలో అగ్రికల్చర్ జోన్ పై అపోహలు వద్దని మంత్రి నారాయణ తెలిపారు. అగ్రికల్చర్ జోన్ అంటే గ్రీన్ బెల్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అగ్రికల్చర్ జోన్ లో కూడా అర్బన్ సెంటర్లు ఉంటాయని చెప్పారు.
తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి రెండుమూడు రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు. 3 లక్షల చదరపు అడుగుల చొప్పున 2 అంతస్థుల్లో సచివాలయ భవనం నిర్మిస్తామని తెలిపారు. మే నెల నాటికి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.