
ఉంచుదామా? తొలగిద్దామా..?
రాష్ట్రంలోని గురుకు లాల్లో దాదాపు 7వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) మరోసారి చర్చనీయాం శంగా మారింది.
టెట్ వెయిటేజీపై ప్రభుత్వం తర్జన భర్జన
కుదరదంటున్న టీఎస్‌పీఎస్సీ.. ఇవ్వాల్సిందేనంటున్న విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకు లాల్లో దాదాపు 7వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) మరోసారి చర్చనీయాం శంగా మారింది. టెట్ వెయిటేజీని పరిగణ నలోకి తీసుకోవాలా? వద్దా? అసలు టెట్ అవసరమా? అన్న విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంలో టీఎస్‌పీఎస్సీ, విద్యాశాఖ పరస్పరం భిన్న వాదనలు వినిపిస్తుం డటంతో కొంత గందరగోళంలో పడింది. నియామకాలు చేపట్టే క్రమంలో విద్యాశాఖ నిర్వహించిన పరీక్షకు తాము 20 శాతం వెయిటేజీని అమలు సాధ్యం కాదని టీఎస్‌పీఎస్సీ చెబుతోంది. అయితే పార్లమెంటు చట్టం ద్వారానే ఏర్పడిన జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) టెట్ నిర్వహించాలని, దాని స్కోర్‌కు ఉపాధ్యా య నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఆ నిబంధనను కచ్చి తంగా అమలు చేయాల్సిందేనని విద్యా శాఖ చెబుతుండ టంతో గందరగోళం నెలకొంది.
ఈ విషయంలో ఇప్పటికే పలు మార్లు చర్చించిన ప్రభుత్వం.. ఇటీవల మరోసారి విద్యాశాఖ, టీఎస్‌పీఎస్సీతో చర్చించింది. ఈ విషయంలో ఎవరి వాద నలు వారు చెప్పడంతో ఏం చేయాలన్నది సందిగ్ధంలో పడింది. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఈ వారంలో జారీ చేయాల్సి ఉన్నందున.. త్వరగా టెట్ విషయాన్ని తేల్చాలని టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో టెట్‌పై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని దాదాపు 6.5లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యా యులు ఎదురు చూస్తున్నారు. వీరిలో 3.5 లక్షల మంది వరకు టెట్‌లో అర్హత సాధించగా, మరో 3 లక్షల మంది వరకు టెట్‌లో అర్హత సాధించని వారున్నారు.
ఏపీలో తొలగించారంటున్న టీఎస్‌పీఎస్సీ
ఉపాధ్యాయ నియామకాలకు ప్రత్యే కంగా పరీక్షలు నిర్వహిస్తున్న మన రాష్ట్రం లో టెట్ అవసరమే లేదన్న భావనలో టీఎస్‌పీఎస్సీ ఉంది. పైగా అవి ఎన్‌సీటీ ఈ మార్గదర్శకాలే అని, వాటిని కచ్చితం గా అమలు చేయాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. మరో వైపు పక్కనున్న ఏపీ లోనూ టెట్‌ను తొలగించి 2014లో ఉపా ధ్యాయ నియామకాలు చేపట్టారన్న వాద నను ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటి కే గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి మూడు పేపర్లతో 450 మార్కులతో కూడిన రెండంచెల (ప్రిలిమినరీ, మెయిన్) పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం గత ఏడాది జూన్ 30న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో టెట్ అవసరమే లేదన్న యోచనలో ఉంది. కానీ విద్యాశాఖ మాత్రం టెట్, దానికి వెయిటేజీ ఉంచా ల్సిందేనని, ఎన్‌సీటీఈ నిబంధనలను అమలు చేయాల్సిం దేనని పేర్కొంటోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.