సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణలో దొరల పాలనను అంతమొందించేందుకు,ప్రజల తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధనకు ప్రజా సంఘాలు సంఘటితం కావాలని సీపీఎం రాష్ట్ర కారదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రకు సంఘీభావంగా దళితుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం ఎజెండాగా మహాజన పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
సామాజిక న్యాయం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాములు మాట్లాడుతూ అక్టోబర్ 17 ఇబ్రహీంపట్నంలో ప్రారంభమయ్యే యాత్ర మార్చి 17 వరకు కొనసాగుతుందన్నారు. యాత్రను అంబేద్కర్ మనువడు ప్రకాష్ అంబేద్కర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మోదీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. నాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ఓగోటి కిరణ్, మాస్టార్జీ, డాక్టర్ కాలువ మల్లయ్య, రమేష్, జి.నరేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.