గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
- తమ్మినేని వీరభద్రం డిమాండ్
హైదరాబాద్: కొత్త జనాభా ప్రకారం గిరిజ నులకు 10 శాతం రిజ ర్వేషన్ అమలు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిరిజనుల రిజర్వేషన్‌పై మాక్ అసెంబ్లీ’ కార్యక్రమంలో తమ్మినేని మాట్లాడారు. గిరిజనుల సమస్యలతో పాటు అనేక సమస్యలు ఆందోళన కల్గిస్తున్నాయన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పోరేట్ శక్తులకే మేలు చేస్తోందన్నారు. విద్య, దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు 2 బెడ్ రూం ఇళ్లు హామీలు ఏమయ్యాయని వీరభద్రం ప్రశ్నించారు.రైతులు ఆత్మ హత్యలు పెరుతున్నా ప్రభుత్వం స్పందిం చటం లేదని ఆరోపించారు.