థ్యాంక్యూ పోలీస్‌ అన్నా | than q police | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ పోలీస్‌ అన్నా

Published Tue, Jul 26 2016 9:05 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

థ్యాంక్యూ పోలీస్‌ అన్నా - Sakshi

థ్యాంక్యూ పోలీస్‌ అన్నా

డాబాగార్డెన్స్‌: మానవత్వం వెల్లివిరిసింది. మన చుట్టూ జరిగే పరిణామాలు..ప్రమాదాలు..అనుకోని సంఘటనలు జరిగితే మనకెందుకులే అన్న ఈ రోజుల్లో కూడా మానవత్వం ఉందని ఆ పోలీసులు నిరూపించారు. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసుల కళ్లెదుటే ఓ వృద్ధుడు బట్టల్లేక..వర్షంలో నానుతూ..చలికి వణుకుతూ రోడ్డు మధ్యలోనే నిస్సహాయిడిగా కనిపించాడు. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఆ వృద్ధుడు వద్దకు వెళ్లి పేరు..ఊరు..చిరునామా..వివరాలు అడిగారు.  మాట కూడా సరిగ్గా రాకపోవడాన్ని వారు గమనించారు. ముందుగా ఓ ఆటోను పిలిచి ఆ ఆటోపై అడడ్ని కూర్చోబెట్టి సమీపంలో ఉన్న ఓ బస్‌షెల్టర్‌కు తీసుకెళ్లి..అనంతరం వద్ధాశ్రమానికి అప్పజెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement