సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ఏటా కొత్తగా 1.2 లక్షల గొంతు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు అపోలో క్యాన్సర్ ఆస్పత్రి నెక్ అ ండ్ హెడ్ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ ఉమానాథ్ నాయక్ అన్నారు. అన్ని క్యాన్సర్లలో దీని వాటా 10–15 శాతం ఉంటుందన్నారు.
శనివారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన ‘స్వర పేటిక క్యాన్సర్’పై సదస్సులో మాట్లాడుతూ గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు మాట్లాడలేక పోవడంతో పాటు ఆహారాన్ని కూడా మింగలేక పోతున్నారని, దీనిని సకాలంలో గుర్తిస్తే నయం చేయవచ్చన్నారు. డాక్టర్ మురాదా లాలా పలువురు వైద్యులు సదస్సులో పాల్గొన్నారు.