- ఏటూరునాగారంలో నూతన భవనానికి యత్నం
- lమహబూబాబాద్, వరంగల్‌లోనూ ఆఫీస్‌లు
జిల్లా మలేరియా కార్యాలయం ఏజెన్సీకే
Published Fri, Sep 2 2016 12:17 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
ఏటూరునాగారం : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లా మలేరియా కార్యాలయం ఇక నుంచి ఏజెన్సీకే పరిమితం కానుంది. దీంతో మారుమూల గ్రామాల మలేరియా రోగులకు వైద్యం చేరువలోకి రానుంది. వరంగల్‌లోని డీఎంహెచ్‌ఓ భవనం మూడో అంతస్తులో ఉన్న మలేరియా కార్యాలయ విభాగంలో కొందరు, మండలకేంద్రంలోని కార్యాలయంలో కొందరు ఇప్పటివరకు వంతులవారీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
నూతన జిల్లాల ఏర్పాటుతో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో జయశంకర్ జిల్లాలోని ఏటూరునాగారంలోనే ఉండాలి. జిల్లాలోని 51 మండలాల్లోని అన్ని గ్రామాలకు 16 క్లస్టర్ యూనిట్లుగా విభజించారు. క్లస్టర్‌కు ఒక సబ్‌యూనిట్ ఆఫీసర్‌ను నియమించి దోమల నివారణ మందులు, ఫాగింగ్, ల్యాబ్ పరీక్షలు, మలేరియా జ్వరాల నిర్మూలన కార్యక్రమాలను చేపడుతున్నారు. మండలకేంద్రంలో జిల్లా కార్యాలయం పూర్తి పరిపాలన పరంగా అభివృద్ధి చెందనుంది. జిల్లాల విభజనతో ఏజెన్సీలోని ఏటూరునాగారం, మహబూబాబాద్, వరంగల్‌లో వేర్వేరుగా జిల్లా మలేరియా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఖాళీల పోస్టులతో డీఎంఓ
జిల్లా మలేరియా కార్యాలయంలో 1 సూపరింటెండెంట్, 3 ఫీల్డ్ వర్కర్ల పోస్టులు, 170 హెల్త్ అసిస్టెంట్లు (మేల్), 2 డ్రైవర్లు, 2 సబ్ యూనిట్ ఆఫీసర్లు, 2 సుపీరియర్ హెల్త్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీటిని భర్తీ చేసేనే ఏజెన్సీ ప్రజలకు మలేరియా శాఖ సేవలు పూర్తిగా అందే అవకాశాలు ఉన్నాయి.
10 క్లస్టర్ల ఏర్పాటు
జయశంకర్ జిల్లాలో ములుగు, చిట్యాల, పరకాల, ఏటూరునాగారం, తాడ్వాయితోపాటు మహాముత్తారం, కాటారం, మహదేవ్‌పూర్, మల్హర్‌రావు, భూపాలపల్లి ఉండటంతో 10 క్లస్లర్లు ఏర్పాటు చేసి సబ్ యూనిట్ ఆఫీసర్‌ను నియమించనున్నారు. దీంతో పరిపాలన అంతా ఏటూరునాగారం నుంచే సాగడం కోసం అన్ని హంగులు ఉన్న మలేరియా కార్యాలయం నూతన భవనం కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
Advertisement
Advertisement