క్షుద్ర పూజలకు పసికందు బలి | The father was killed 28 days baby | Sakshi
Sakshi News home page

క్షుద్ర పూజలకు పసికందు బలి

Published Tue, Nov 24 2015 3:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

క్షుద్ర పూజలకు పసికందు బలి - Sakshi

క్షుద్ర పూజలకు పసికందు బలి

28 రోజుల పసిగుడ్డును చంపేసిన తండ్రి
 ఒంగోలు క్రైం:  క్షుద్ర పూజల కోసం ఒక తండ్రి కొడుకునే బలిచ్చిన దుర్ఘటన  సోమవారం ఒంగోలులో జరిగింది. ఒంగోలు నగరం వెంగముక్కపాలెం రోడ్డులోని మదర్ థెరిస్సా కాలనీకి చెందిన సిద్ది రాజారెడ్డి అలియాస్ దెయ్యాల రాజారెడ్డి (50) క్షుద్రపూజలు చేస్తుంటాడు. రెండేళ్ల కిందట మతి స్థిమితం లేని మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి నెల కిందట మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు పక్కింట్లోని బాలింత కళావతి  తన స్తన్యాన్నిచ్చి ఆకలి తీర్చేది. ఇలా పాలివ్వడానికి వచ్చిన ఆమెకు పసిబిడ్డ కనిపించలేదు.

రాజారెడ్డిని నిలదీసినా ఫలితం లేకపోవడంతో స్థానికులు వచ్చి దేహశుద్ధి చేశారు. దీంతో బిడ్డను తానే చంపానని మూలన పడేసిన మృతదేహాన్ని చూపించాడు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement