గిరిజన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
Published Tue, Aug 9 2016 6:59 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
గిరిజన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించి గిరిజనుల హక్కు దినంగా పాటించాలని తెలంగాణ గిరిజన సఘం ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మానాయక్ మాట్లాడుతూ నేటికి గిరిజనులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనులకు ఉన్న హక్కులను కూడ కాలరాస్తున్నారని విమర్శించారు. అనేక మంది గిరిజనులు కనీస సౌకర్యాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు.కూడు, గూడు, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న ప్రభుత్వాలు పట్టన ట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామాకాలు గిరిజనుల ధరి చేరటం లేవని అన్నారు.
తెలంగాణలో గిరిజనులు 10 శాతం ఉంటే 6 శాతమే రిజర్వేస్లను అమలు చేస్తూ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు.పట్టణాలకు దూరంగా ఉన్న గిరిజన తండాలకు కనీస సౌకర్యాలు లేక సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు.ఎన్నికల సమయంలో తండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తామని మోసం చేస్తున్నారని విమర్శించారు.విద్య హ క్కు చట్టాన్ని అమలు చేయకుండా మాటలతో గారడి చేస్తున్నారని అన్నారు. ప్రపంచ గిరిజన దినోత్సవం స్పూర్తిగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు చందునాయక్, రాంకుమార్, శేఖర్, కృష్ణ, శోభన్ నాయక్‌లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement