గురివింద చంద్రం అసలు రూపం
నీతిపరుణ్ణి... నిజాయితీకి నేను మారుపేరు... విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నా.... మాటతప్పను.. నాకు ఉన్నదే క్యారెక్టర్...అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నా....
⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య వీటిని పదేపదే వల్లెవేస్తున్నారు.
⇒ ఈ నేతిబీర పలుకుల్లో నెయ్యి ఎంత ఉందో చూద్దామా...!!
నీతిపరుణ్ణి.. నిజాయితీకి మారుపేరు నేను
►మరి రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఆస్తులెలా పెరిగాయి?
►ఎమ్మెల్యేకి రూ. 30 కోట్లు ఇవ్వగలిగినన్ని ఆస్తులెక్కడివి?
►రూ. 2,500 కోట్ల టర్నోవర్‌తో దేశంలోని అన్ని నగరాల్లో హెరిటేజ్ మాల్స్ ఎలా వచ్చాయి?
►నీతిపరుడివైతే అన్ని ఆరోపణలేమిటి? అన్ని కేసులేమిటి?
►ఏ కేసులోనూ విచారణకు సిద్ధపడకపోవడమేనా నిజాయితీ?
రాజకీయాల్లో విలువల కోసం పాటుపడుతున్నా..
► రాజకీయాల్లో విలువలంటే ఓటుకు రూ. 500 నోటు పరిచయం చేయడమా?
► ఎమ్మెల్యేలతో వైశ్రాయ్ క్యాంపులు నడిపి దొడ్డిదారిన పీఠం కైవసం చేసుకోవడమా?
►ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఇతర ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి కొనుగోళ్లు జరపడమా?
► తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికినా బుకాయించడమా?
► సైద్ధాంతిక నిబద్ధత ఉందా..? బీజేపీ, లెఫ్ట్, టీఆర్‌ఎస్‌తో అవకాశవాద పొత్తులే నిదర్శనం కాదా?
ఆడినమాట తప్పను..
► ఇచ్చిన మాటపై జీవితంలో ఎప్పుడన్నా నిలబడ్డారా?
► రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలేమయ్యాయి?
►‘పథకాలపై ఆధారపడొద్దు.. ప్రత్యామ్నాయం చూసుకోండి’ అనడమా మాటపై నిలబడడమంటే?
► కాపుల రిజర్వేషన్, బోయలను ఎస్టీలలో చేర్చడం, వర్గీకరణపై ఇన్ని కప్పదాట్లు ఎందుకు?
నాకు ఉన్నదే క్యారెక్టర్...
► మీ దృష్టిలో క్యారెక్టర్ అంటే అర్ధమేమిటి?
►నమ్మినవాళ్లను మోసం చేయడమా? వెన్నుపోటు పొడవడమా?
►అధికారమే పరమావధిగా డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడమా?
► రైతులను, ఎస్సీలను, మహిళలను, మురికివాడల్లో నివసించే పేదలను కించపరచడమా?
సమస్యను పక్కదారి పట్టించడం.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పబ్బం గడపడమా?
అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నా..
►మీ స్థాయి ఆస్తులెవరికి ఉన్నాయి?
► ఖరీదైన భవంతులు..ఊరూరా హెరిటేజ్ వ్యాపారాలు... సింగపూర్‌లో వ్యాపార స్నేహాలు..
►కాలు కదిపితే ప్రత్యేక విమానం, పక్క జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్, అమెరికా అధ్యక్షుడికి కూడా లేనన్ని సదుపాయాలతో ప్రత్యేక బస్సు సామాన్యులకు సాధ్యమా?
►అమరావతిలో మీ నివాసం లింగమనేని ఎస్టేట్స్‌లో ఉన్నన్ని హంగులెవరికి ఉన్నాయి?
తప్పు చేయలేదు.. చేయను...
► తప్పు మీద తప్పు చేయడం.. అడ్డంగా దొరికిపోయినా ఎదురుదాడి చేయడం మీ నైజం కాదా?
► కాపు నాయకులను హత్య చేయించడంపై కన్నాతో సహా ఎంతమంది చెప్పలేదు?
►కుల రాజకీయాలపై యూనివర్సిటీలోనే మీరు గోల్డ్ మెడల్ సంపాదించలేదా?
► 26 కేసుల్లో మీపై విచారణలు జరగడం.. వాటిపై మీరు స్టే తెచ్చుకోవడం నిజంకాదా?
► ఏ తప్పూ చేయకుండా రెండెకరాలతో రెండు లక్షల కోట్లు ఎలా ఆర్జించారో?
లోకేశ్..రాజకీయ లెగసీ..
► కొడుకును పద్ధతిగా పెంచితే చదువుకునే వయసులోనే అన్ని ఆరోపణలెందుకొచ్చాయి?
►ఇంటర్‌లో అత్తెసరు మార్కులతో స్టాన్‌ఫోర్డ్ సీటెలా వచ్చింది?
►అమెరికాలో వేసిన వేషాలపై సోషల్‌మీడియాలో ఫొటోలమాటేమిటి?
►ఈవీఎంల దొంగతో స్నేహం చేయడం అతనికి ఐటీవింగ్ బాధ్యతలివ్వడం నిజంకాదా?
► జీహెచ్‌ఎంసీ ఎన్నికలో ఒక్కసీటు సాధించడమా రాజకీయాల్లో లోకేష్ లెగసీ?
బాబూ మీ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. మేనేజ్ చేయడం
► వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేయడంలో మీకు మీరే సాటి. పాతాళానికైనా దిగజారి పనిజరిగేలా చూసుకోవడంలో మీరు సిద్ధహస్తులు.
► ఎల్లకాలం మేనేజ్ చేస్తూనే శిఖరాగ్రాన కొనసాగవచ్చని నిరూపించిన ఘనా పాటి మీరు. శతకకారుల అంచనా లకు కూడా అందని ఘనత మీది.
అబద్ధాలు
► అబద్ధాలే జీవితమనుకుంటూ అబద్దాలను ఆశ, శ్వాసగా భావిస్తూ.. కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో అబద్ధాలాడడం మీకే చెల్లింది.
► ఎన్ని అబద్ధాలాడినా, మోసగించినా ప్రజా జీవితంలో కొనసాగవచ్చు అనడానికి మీ 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ప్రత్యక్ష నిదర్శనం.
గోబెల్స్ ప్రచారం
► మీ వందిమాగధులుగా వ్యవహరించే ఎల్లో మీడియా వెన్నుదన్నుతో అబద్ధా న్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా నమ్మించగలిగిన అపర గోబెల్స్‌మీరు.
► మీ గోబెల్స్ ప్రచారం అనన్య సామా న్యమైనది. ఇలాంటి ప్రచారాలతో ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం మీరు చేసినంతగా మరెవ్వరూ చేయలేరు.