దేవాలయాల్లో దొంగలు పడ్డారు | The Temples Were Thieves | Sakshi
Sakshi News home page

దేవాలయాల్లో దొంగలు పడ్డారు

Published Sun, Aug 28 2016 7:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

దేవాలయాల్లో దొంగలు పడ్డారు

దేవాలయాల్లో దొంగలు పడ్డారు

టంగుటూరు(రాజుపాళెం): దేవాలయాల్లో దొంగలు పడ్డారు. ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీ చేశారు. రాజుపాళెం మండలంలోని టంగుటూరులో రామాలయం, గంగమ్మ, వీరభద్ర దేవాలయాల తాళాలను ఆదివారం తెల్లవారుజామున పగులగొట్టి హుండీలను ఎత్తుకెళ్లారు. వాటిని కుందూ నదికి వెళ్లే రస్తాలో పగులగొట్టి అందులో ఉన్న నగదును దోచుకున్నారు. ఆ హుండీలను అక్కడే వదిలేసి వెళ్లారు. కుందూకు వెళ్లే దారిలో గంగమ్మ, వీరభద్రస్వామి దేవాలయాలు ఉన్నాయి. గంగమ్మ దేవాలయంలో తెల్లవారుజామున రెండు గంటల వరకు గ్రామస్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాతనే ఈ ఘటన జరిగిందని వారు అనుకుంటున్నారు. గ్రామం మధ్యలో రామాలయం ఉంది. ఈ ఆలయాల చుట్టుపక్కల ఇళ్లు ఉన్నాయి. కడప నుంచి క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ మూర్తి పరిశీలించారు. ఈ మూడు ఆలయాల్లో కలిపి మొత్తం రూ.9 వేల వరకు దోచుకెళ్లినట్లు రామాంజనేయులరెడ్డి, నరసింహుడు, రాముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
దేవాలయాలే టార్గెట్‌
ఇటీవల వరుసగా జరుగుతున్న చోరీలను పరిశీలిస్తే.. దొంగలు దేవాలయాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. జిల్లాలో వీరపునాయినిపల్లె మండలంలోని అనిమెల సంగమేశ్వర ఆలయం, రాజుపాళెంలోని శివాలయం, వెల్లాలలోని శివాలయాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. వెల్లాలలోని శ్రీచెన్నకేశవ స్వామి ఆలయంలో హుండీ ఎంత సేపటికి తెరుచుకోక పోవడంతో దొంగలు వెనుతిరిగారు. సీసీ కెమెరాల్లో వారి చిత్రాలు నిక్షిప్తమయ్యాయి. దొంగల ఆచూకీపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచకపోతే మరికొన్ని దేవాలయాల్లో  జరిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. ఎక్కువగా గ్రామాల్లోనే జరుగుతున్నాయి. రాత్రి వేళలో పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని వారు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement