సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
Published Wed, Aug 17 2016 7:07 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
కాసిపేట : మండలంంలోని కెకె ఓపెన్‌కాస్టు నిర్వాసిత గ్రామం దుబ్బగూడెంలో బుధవారం సామాజిక ఆర్ధిక స్థితిగతులపై చేస్తున్న సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. గతవారం రోజుల క్రితం సర్వేలు ప్రారంభించగా తమకు పునరావాసానికి స్థలం ఎక్కడ కేటాయిస్తారో చెప్పాలని అడ్డుకోవడంతో సర్వే నిలిచిపోయింది. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను కలవగా సింగరేణి చూపిన స్థలంతో పాటు గ్రామస్తులు చూసుకున్న అనువైన చోట కేటాయిస్తారని రెండు మూడు ప్రదేశాల్లో స్థలం చూపించడం జరిగింది. తిరిగి సర్వేకు రావడంతో స్థల కేటాయింపుపై స్పష్టత వచ్చాకే సర్వేలు చేయాలని అడ్డుకున్నారు. అధికారులు ముందు సర్వే చేసినట్లయితే ఎంత స్థలం అవసరమో తేలుతుందని, అనంతరం ఇష్టం ఉన్నచోట స్థలం కేటాయించనున్నట్లు తెలిపినప్పటికీ గ్రామస్తులు వినకుండా అధికారులను తిప్పి పంపించారు. మందమర్రి డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, బెల్లంపల్లి డీటీ షరీఫ్ తదితరులున్నారు.
Advertisement