రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | The young man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Published Sun, Jun 19 2016 6:48 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

The young man killed in road accident

వేగంగా వెళ్తున్న టాటా ఏస్‌లో నుంచి దిగడానికి ప్రయత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడులో ఆదివారం చోటుచేసుకుంది. సూరారంకు చెందిన నాగేంద్రబాబు కుటుంబసభ్యులు టాటాఏస్‌లో కొరివి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం జూలూరుపాడు వద్దకు రాగానే నాగేంద్రబాబు(23) టాటాఏస్‌లో నుంచి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement